గీతా ఆర్ట్స్ అతనికి ఛాన్స్ ఇస్తుందా..?
టిల్లు స్క్వేర్ లాంటి సూపర్ హిట్ సినిమా కొట్టాక జాక్ తో వచ్చి ఆ సక్సెస్ మేనియా కొనసాగిస్తాడు అనుకున్న సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన జాక్ తో నిరాశపరిచాడు.
By: Tupaki Desk | 24 May 2025 3:04 PMటిల్లు స్క్వేర్ లాంటి సూపర్ హిట్ సినిమా కొట్టాక జాక్ తో వచ్చి ఆ సక్సెస్ మేనియా కొనసాగిస్తాడు అనుకున్న సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన జాక్ తో నిరాశపరిచాడు. ఆ సినిమా ఫ్లాప్ కి కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. ఒక సినిమా వర్క్ అవుట్ అవ్వాలంటే హీరో, డైరెక్టర్ కెమిస్ట్రీ కుదరాలి. సిద్ధు కి రైటింగ్ లో కూడా టచ్ ఉండటం వల్ల తన సినిమాల విషయంలో కాస్త జోక్యం ఎక్కువ అవుతుందన్న టాక్ ఉంది. ఐతే అది సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బొమ్మరిల్లు భాస్కర్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత వచ్చిన ఛాన్స్ జాక్. ఈ సినిమాతో సక్సెస్ కొడితే వరుస అవకాశాలు వచ్చేవి కానీ జాక్ తో పెద్ద షాకే తగిలింది. అసలు స్పై సినిమాను ఇంత కామెడీగా చేయొచ్చా అన్నట్టుగా భాస్కర్ డైరెక్షన్ చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలు తీయకపోయినా ఆయన తీస్తే మంచి సినిమా తీస్తాడన్న క్రేజ్ ఉంది. కానీ జాక్ తో అది పోయేలా చేసుకున్నాడు.
బ్యాచిలర్ సినిమా కూడా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా బొమ్మరిల్లు భాస్కర్ ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఐతే బ్యాచిలర్ సినిమా తర్వాత మళ్లీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే భాస్కర్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ తోనే అతని సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ జాక్ రిజల్ట్ చూశాక అది కుదురుతుందా లేదా అన్న డౌట్ మొదలైంది.
ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తేనే అతనికి నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన బొమ్మరిల్లు భాస్కర్ జాక్ తో ఉన్న ఒక్క అవకాశాన్ని మిస్ యూజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ సినిమా ఎవరు ఛాన్స్ ఇస్తారు ఇచ్చినా భాస్కర్ కంబ్యాక్ ఇస్తాడా అన్న డౌట్స్ మొదలయ్యాయి. గీతా ఆర్ట్స్ లో పడితే మాత్రం అక్కడ డైరెక్టర్ ఎవరైనా మోనిటరింగ్ చాలా పకడ్బందీగా ఉంటుంది కాబట్టి బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ ఈమధ్య చిన్న సినిమాలతోనే మంచి సక్సెస్ లు అందుకుంటుంది. రీసెంట్ గా సింగిల్ తో సూపర్ హిట్ అందుకున్న గీతా ఆర్ట్స్ పలు సినిమాలను లైన్ లో పెడుతుంది. మరి బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా గీతా ఆర్ట్స్ మరో అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.