Begin typing your search above and press return to search.

గీతాంజలి మళ్ళీ వచ్చింది.. కామెడీ సీన్స్ తో కోనా కౌంటర్

అయితే సినిమాకి వచ్చిన రివ్యూలపై హర్ట్ అయిన రైటర్ కోన వెంకట్ థియేటర్స్ లో గీతాంజలి మూవీ చూస్తూ ఆడియన్స్ ఎలా నవ్వుకుంటున్నారు అనేది రికార్డ్ చేసిన వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   13 April 2024 11:36 AM GMT
గీతాంజలి మళ్ళీ వచ్చింది.. కామెడీ సీన్స్ తో కోనా కౌంటర్
X

గతంలో అంజలి లీడ్ రోల్ లో గీతాంజలి అనే మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, రావు రమేష్ లాంటి వారు ఆ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గీతాంజలి చిత్రం చిత్రానికి కోన వెంకట్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆ సినిమాతో రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2014లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాలో కూడా అంజలి లీడ్ రోల్ లో నటించింది. అలాగే శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్య, సునీల్ ఇతర పాత్రలలో మెరిశారు. హర్రర్ కామెడీ జోనర్ లోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. కోన వెంకట్ మళ్ళీ అదే స్టైల్ లో ఈ చిత్రానికి కూడా కథ, స్క్రీన్ ప్లే అందించారు. శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమాకి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి.

మూవీలో చెప్పుకోదగ్గ కామెడీ, అలాగే భయపెట్టేంత హర్రర్ సీక్వెన్స్ లేవని రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే సినిమాకి వచ్చిన రివ్యూలపై హర్ట్ అయిన రైటర్ కోన వెంకట్ థియేటర్స్ లో గీతాంజలి మూవీ చూస్తూ ఆడియన్స్ ఎలా నవ్వుకుంటున్నారు అనేది రికార్డ్ చేసిన వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో సత్య, దెయ్యంతో చేసిన కామెడీని ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది.

హాస్యానికి స్పందించలేని మేధో సమీక్షకులందరికి మా సమాధానం ఒక్కటే. ఈ సినిమాకి థియేటర్స్ లో వస్తోన్న స్పందన ఇలా ఉంది అంటూ వీడియో జత చేశారు. అయితే కోన వెంకట్ పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలలో కామెడీ బాగుందని, ఓవరాల్ గా చూసుకుంటే చెప్పుకోదగ్గ విధంగా లేదని అంటున్నారు.

కేవలం మూవీలో సత్య పెర్ఫార్మెన్స్ తో కొంత కవ్వించే ప్రయత్నం చేసాడని, సన్నివేశాలు అంత గొప్పగా లేవని ట్వీట్ లు చేస్తున్నారు. ఎవరు ఏ విధంగా రియాక్ట్ అయిన ఈ వీకెండ్ దాటితే సినిమాకి ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అనేదానిని బట్టి 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. వీకెండ్ అనంతరం మూవీ హిట్ అయ్యిందా లేదంటే ఫ్లాప్ కేటగిరీలోకి చేరిందా అనేది తెలిసే అవకాశం ఉందని మరికొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.