Begin typing your search above and press return to search.

సచిన్‌, కాంబ్లే లవ్‌ స్టోరీ ప్లాన్‌ చేస్తున్నాడా...!

ప్రేమ కథలను అద్భుతంగా మనసుకు హత్తుకునే విధంగా తెరకెక్కించడం లో తనకు తానే సాటి అని చాలా సార్లు నిరూపించుకున్న దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:44 AM GMT
సచిన్‌, కాంబ్లే లవ్‌ స్టోరీ ప్లాన్‌ చేస్తున్నాడా...!
X

ప్రేమ కథలను అద్భుతంగా మనసుకు హత్తుకునే విధంగా తెరకెక్కించడం లో తనకు తానే సాటి అని చాలా సార్లు నిరూపించుకున్న దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. ఈయన ప్రస్తుతం దర్శకుడిగా కంటే కూడా ఎక్కువగా నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న గౌతమ్‌ మీనన్‌ నుంచి ఆసక్తికర సినిమా రాబోతుంది.

సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్‌ మీనన్ ఈ సారి క్రికెట్‌ లవ్‌ స్టోరీ ని ప్లాన్‌ చేస్తున్నాడట. ఇండియన్‌ క్రికెట్‌ గురించి మాట్లాడాలి అంటే సచిన్‌ గురించి ప్రస్థావన తప్పనిసరి అనే విషయం తెల్సిందే. ఇక సచిన్‌ ప్రస్థావన వచ్చిన ప్రతిసారి కచ్చితంగా వినోద్‌ కాంబ్లే గురించి కూడా చర్చ వస్తుందనే విషయం తెల్సిందే.

ఈ మధ్య కాలంలో చాలా మంది క్రికెటర్స్‌ యొక్క బయోపిక్‌ లు వచ్చాయి. ఆ బయోపిక్స్‌ ల్లో కొన్ని సూపర్‌ హిట్ అవ్వగా కొన్ని డాక్యుమెంటరీ తరహాలో ఉన్నాయి అన్నట్లుగా విమర్శలు పొందాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించిన క్రికెటర్స్ బయోపిక్స్‌ కి మంచి టాక్‌ వచ్చింది. కనుక గౌతమ్‌ మీనన్ అదే ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

సచిన్‌ మరియు వినోద్‌ కాంబ్లే ల యొక్క స్నేహం మరియు వారి ఆట గురించి చాలా మందికి అప్పటి తరం వారికి తెలుసు. కానీ ఇప్పటి వారికి వారి గురించి తెలియదు. కనుక ఆ ఇద్దరి స్నేహం మరియు ఆట కి సంబంధించిన విషయాలను చూపిస్తూ ఒక సినిమాను చేయాలని గౌతమ్‌ మీనన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లైవ్‌ టెలికాస్ట్‌ లో దర్శకుడు గౌతమ్‌ మీనన్ పాల్గొన్నాడు. ఆ సందర్భంగా క్రికెట్‌ నేపథ్యంలో సినిమా తీయబోతున్నాను. అందుకోసం కథ కూడా రెడీ అయిందని దర్శకుడు పేర్కొన్నాడు.

వారిద్దరూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలా ఎదిగారు, ఆ తర్వాత జరిగిన పరిణామాల తో సినిమా ను తీస్తాను అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా సినీ మరియు క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని పంచడం ఖాయం. సచిన్‌, కాంబో మధ్య స్నేహం ను ఒక ప్రేమ కథ మాదిరిగా దర్శకుడు చూపిస్తాడేమో చూడాలి.