Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : గౌతం అన్ ఫెయిర్ ఎలిమినేషన్..!

గౌతం, శోభా శెట్టి కూడా తమకు ఆ పాస్ అవసరం లేదని చెప్పారు. అలా గౌతం కృష్ణ ఎలిమినేషన్ జరిగింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 7:26 AM GMT
బిగ్ బాస్ 7 : గౌతం అన్ ఫెయిర్ ఎలిమినేషన్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో 13వ వారం గౌతం కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో అమర్ తప్ప లాస్ట్ వీక్ మొత్తం ఏడుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో గౌతం కృష్ణ, శోభా శెట్టి లీస్ట్ టూ గా ఉన్నారు. ఇక వారిద్దరిలో గౌతం కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. లీస్ట్ 3 లో పల్లవి ప్రశాంత్ ఉండగా అతనికి ఉన్న ఎవిక్షన్ పాస్ తన కోసం కానీ గౌతం, శోభాల కోసం కానీ వాడమని నాగార్జున చెప్పాడు. పల్లవి ప్రశాంత్ తనకోసం ఎవిక్షన్ పాస్ వాడనని చెప్పాడు.

గౌతం, శోభా శెట్టి కూడా తమకు ఆ పాస్ అవసరం లేదని చెప్పారు. అలా గౌతం కృష్ణ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ గురించి కూడా ఆడియన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శోభా శెట్టి కన్నా గౌతం బాగానే ఆట ఆడుతున్నాడని శోభా, ప్రియాంకల కన్నా గౌతం హౌస్ లో ఉండే అర్హత ఉందని అంటున్నారు. గౌతం కృష్ణ ఎలిమినేషన్ పై అతని ఫాలోవర్స్ అప్సెట్ అయ్యారు.

అర్జున్ ఫినాలే పాస్ గెలవడం వల్లే గౌతం కృష్ణ శోభా లీస్ట్ పొజిషన్ లోకి వచ్చారని హోస్ట్ నాగార్జున చెప్పారు. మీ ఆటే మిమ్మల్ని కాపాడుతుంది. మరేది కాదని నాగార్జున అనారు. గౌతం కృష్ణ మొదటి వారం నుంచి ఇండివిడ్యువల్ గేం ఆడుతున్నాడు. శివాజి ని టార్గెట్ చేస్తూ అతనితో రెగ్యులర్ గా గొడవ పడుతున్నాడు.

ఇక మరో రెండు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ సీజన్ 7 లో టైటిల్ విజేతగా గెలిచే వ్యక్తి ఎంత గెలుచుకుంటాడన్నది రివీల్ చేశారు. ప్రైజ్ మనీగా 50 లక్షలు ఇంకా జోయాలుక్కాస్ వారి 15 లక్షల గోల్డ్ ఆర్నమెంట్స్ గిఫ్ట్ గా వస్తాయని అన్నారు నాగార్జున. అంతేకాదు బ్రీజా కారు కూడా కానుకగా వస్తుందని చెప్పారు. మొత్తానికి 70 నుంచి 75 లక్షల దాకా బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా రేసులో ముగ్గురు హౌస్ మెట్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్, శివాజి టాప్ 2లో ఉండగా అమర్ దీప్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే అమర్ దీప్ చాలా టాస్కుల్లో ఫౌల్స్ ఆడాడు. ఇంకా అందరి సపోర్ట్ తోనే ఏ ఆట అయినా ఆడుతున్నాడు. కాబట్టి అతనికి కాకుండా శివాజి, పల్లవి ప్రశాంత్ లలో ఒకరు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.