Begin typing your search above and press return to search.

సచిన్- వినోద్ కాంబ్లి స్పూర్తితో గౌత‌మ్ మీన‌న్!

క్రికెట్ ని అమితంగా ఇష్ట‌ప‌డే ఇద్ద‌రు స్నేహితుల క‌థ ఇది. స‌చిన్ డెంటూల్క‌ర్-వినోద్ కాంబ్లి ని స్పూర్తిగా తీసుకుని ఆ పాత్ర‌ల్ని క్రియేట్ చేస్తా అని అన్నారు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:52 AM GMT
సచిన్- వినోద్ కాంబ్లి స్పూర్తితో గౌత‌మ్ మీన‌న్!
X

స్టార్ మేక‌ర్ గౌత‌మ్ మీన‌న్ మ‌ళ్లీ డైరెక్ట‌ర్ గా యాక్టివ్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న తెర‌కెక్కిం చిన 'ధృవ‌న‌క్ష‌త్రం' చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. వాయిదాల మీద వాయిదా త‌ర్వాత రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఈ నేప‌థ్యంలో తాజాగా గౌత‌మ్ మీన‌న్ అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ కూడా ప్ర‌క‌టించారు. క్రికెట్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలిపారు.

క్రికెట్ ని అమితంగా ఇష్ట‌ప‌డే ఇద్ద‌రు స్నేహితుల క‌థ ఇది. స‌చిన్ డెంటూల్క‌ర్-వినోద్ కాంబ్లి ని స్పూర్తిగా తీసుకుని ఆ పాత్ర‌ల్ని క్రియేట్ చేస్తా అని అన్నారు. దీంతో ఈ క‌థ‌కి స‌చిన్-కాంబ్లి జోడీ క్రికెట్ స్టోరీకి చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉన్న‌ట్లు తెలుస్తుంది. స‌చిన్-వినోద్ కాంబ్లి పాత్ర‌ల్ని కేవ‌లం స్పూర్తిగానే తీసుకుని క్రికెట్ ఇష్ట‌ప‌డే స్నేహితుల క‌థ‌లా దీన్ని డిజైన్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి రాని ఇద్ద‌రు స్నేహితులు..అదే అంత‌ర్జాతీయ మ్యాచులు ఆడిన ప్లేయ‌ర్స్ స్పూర్తి అన్న‌ది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది క‌ల్పిత క‌థ కాదు. బ‌యోపిక్ లా తెర‌పై ఆవిష్క‌రించే అవ‌కాశం ఉంది. ఇలాంటి జాన‌ర్ లో గౌత‌మ్ మీన‌న్ ఇంత‌వ‌ర‌కూ సినిమాలు చేయ‌లేదు. ఆయ‌న శైలికి భిన్న‌మైన సినిమా ఇది. ఆయ‌న ఎక్కువ‌గా ల‌వ్ స్టోరీలు తెర‌కెక్కిస్తుంటారు. ఆ క‌థ‌ల్ని ఎంతో బ‌లంగా చెబుతారు. రియ‌లిస్టిక్ గా అనిపిస్తాయి.

అలాగే ఆయ‌న యాక్ష‌న్ సినిమాలు చేసినా అందులో అండ‌ర్ కరెంట్ గా అద్బుత‌మైన ల‌వ్ స్టోరీ కూడా క‌నిపిస్తుంది. మ‌రి ఈ క్రికెట్ స్నేహితుల క‌థ‌లో ల‌వ్ స్టోరీ అనే ఛాన్స్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం గౌత‌మ్ మీన‌న్ న‌టుడిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై కొన్నాళ్ల పాటు న‌ట‌న‌కు దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. స్టోరీ స‌హా స‌ర్వం ఆయ‌నే సిద్దం చేసుకుంటారు. ఇత‌ర రైట‌ర్ల‌పై ఆధార‌ప‌డ‌టం అన్న‌ది చాలా రేర్.