Begin typing your search above and press return to search.

ప్రముఖ నటికి చెందిన రూ.25 కోట్ల భూమి కబ్జా

తాజాగా ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. తనకు చెందిన విలువైన భూమిని కబ్జాకు గురైనట్లుగా ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   13 Sept 2023 5:58 AM
ప్రముఖ నటికి చెందిన రూ.25 కోట్ల భూమి కబ్జా
X

వెండితెర మీద ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి.. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించి.. నిద్ర లేకుండా చేసి.. ఇప్పుడు అమ్మపాత్రలకు పరిమితమైన నటి గౌతమి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఆమెకు చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైనట్లుగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. తనకు చెందిన విలువైన భూమిని కబ్జాకు గురైనట్లుగా ఫిర్యాదు చేశారు.

తన స్థలాన్ని తన కుమార్తె పేరు మీద రాసేందుకు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆళగప్పన్ ను సంప్రదించానని.. ఆ సందర్భంలో ఆయన తనను మోసం చేసినట్లుగా వాపోయారు. శ్రీ పెరంబుదూర్ లో ఉన్న ఆ స్థలాన్ని ఆళగప్పన్.. ఆయన సతీమణితో ఇతరులు కలిసి అక్రమించుకున్నట్లుగా పేర్కొన్నారు.

కబ్జా చేయటమే కాక.. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆమె.. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నటి గౌతమి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రముఖులకు చెందిన భూములు కబ్జాకు గురి కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వెర్షన్ బయటకు రావాల్సి ఉంది.