Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒకప్పటి హీరోయిన్..!

ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం సినిమాలో ఒకప్పటి హీరోయిన్ గౌతమి నటిస్తుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 2:30 PM GMT
ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒకప్పటి హీరోయిన్..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లింది. గబ్బర్ సింగ్ కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. స్వతహాగా పవర్ స్టార్ అభిమాని అయిన హరీష్ శంకర్ ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ సాటిస్ఫైడ్ గా ఉందని తెలుస్తుంది. అంతేకాదు ఆమధ్య సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా అంచనాలు డబుల్ చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తమిళ సినిమా తెరి రీమేక్ గా వస్తుందని తెలిసిందే. అయితే మూల కథను మాత్రమే తీసుకుని మిగతాది అంతా మార్చేశారని అంటున్నారు. ఏది ఏమైనా గబ్బర్ సింగ్ కాంబినేషన్ సినిమా మళ్లీ రికార్డులను సృష్టించే సినిమా అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం సినిమాలో ఒకప్పటి హీరోయిన్ గౌతమి నటిస్తుందని తెలుస్తుంది.

సినిమాలో పవన్ మదర్ రోల్ లో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయట. గౌతమి మంచి నటి ఈమధ్య ఆమె వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే తెలుగులో అన్నీ మంచి శకునములే, శాకుంతలం సినిమాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు సక్సెస్ అందుకోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తో అయినా ఆమె హిట్ అందుకుంటుందేమో చూడాలి.

ఒకప్పటి హీరోయిన్స్ అంతా కూడా మళ్లీ తమ రీ ఎంట్రీతో మెప్పిస్తున్నారు. కథనాయికగా చేసినప్పుడు గౌతమి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానే అలరించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమెకు తగిన పాత్రలు రావట్లేదని చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ లో అయినా ఆమెకు బలమైన సీన్స్ పడాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2024 సమ్మర్ రిలీజ్ ఉంటుందని టాక్. ఈ సినిమాతో పాటుగా పవన్ ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు కూడా చేస్తున్నారని తెలిసిందే.

హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న OG సినిమాను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక రెండేళ్లుగా కొనసాగుతూ వస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారన్నది మాత్రం క్లారిటీ రావట్లేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా OG, ఉస్తాద్ భగత్ సింగ్ మీదే హోప్స్ అన్నీ పెట్టుకున్నారు.