Begin typing your search above and press return to search.

గౌత‌మ్ ..సితార మ‌ధ్య‌లో ఫ్యామిలీ స్టార్!

రియ‌ల్ లైఫ్ లో మ‌హేష్ అంత‌గా ఫ్యామిలీతో త‌న బాండింగ్ ని క్రియేట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 9:02 AM GMT
గౌత‌మ్ ..సితార మ‌ధ్య‌లో ఫ్యామిలీ స్టార్!
X

ఫ్యామిలీ స్టార్ అనే సినిమా మ‌హేష్ తో ప్లాన్ చేస్తే బాగుండేదేమో!న‌ని అప్పుడ‌ప్పుడు అభిమానుల‌కు అనిపిస్తుంటుందేమె! ప‌ర‌శురాం ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌....మ‌హేష్ వ్య‌క్తిగ‌త జీవితంలో ఫ్యామిలీతో గ‌డిపే స‌మ‌యాన్ని చూస్తుంటే! ఈ టైటిల్ కి ప‌క్కా యాప్ట్ అయ్యే స్టార్ మ‌హేష్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. రియ‌ల్ లైఫ్ లో మ‌హేష్ అంత‌గా ఫ్యామిలీతో త‌న బాండింగ్ ని క్రియేట్ చేసుకున్నారు.


వివాహ‌మైన దగ్గ‌ర నుంచి అటుపై పిల్ల‌లు జ‌న్మించ‌డం.. ఆత‌ర్వాత మ‌హేష్ ఫ్యామిలీ లైప్ ని మ‌రింత‌గా ఆస్వాదించ‌డం మొద‌లు పెట్టారు. షూటింగ్ ఉంటే సెట్లో లేక‌పోతే ఇంట్లో..కాస్త టైమ్ దొరికిందంటే ఫ్యామిలీతో ప్లైట్ ఎక్కేయ‌డం అన్న‌ది కొన్ని సంవ‌త్స‌రాలుగా చూస్తున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ మొత్తం జ‌ర్నీని చూస్తే! మ‌హేష్ తో మ‌రో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తీసేయోచ్చు.


తాజాగా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు మ‌హేష్ కుటుంబంతో దుబాయ్ లో సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని ఫోటోల్లో మ‌హేష్ స్నేహితులు..స‌న్నిహితులు కూడా ఉన్నారు. ఇక మ‌హేష్ ఫ్యామిలీ ఫోటోలు క‌నిపిస్తే అభిమానులు ఆగుతారా? ఆ దంప‌తుల్ని....ఆ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేయ‌రు. దుబాయ్ వెకేష‌న్ ఫోటోలు లీకైన నాటి నుంచి ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. తాజాగా న‌మ్ర‌త మ‌రో ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసారు.


అందులో మ‌హేష్ కుమారుడు గౌత‌మ్...కుమార్తె సితార తో టైమ్ స్పెండ్ చేయ‌డాన్ని రివీల్ చేసారు. ముగ్గురు ఇలా హోట‌ల్ లో క‌లిసి ఫోటో దిగారు. ఆప‌క్క‌నే వాళ్ల‌తో పాటు మ‌రో అమ్మాయి ఉంది. ఫోటో ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఇక గౌత‌మ్ అయితే హైట్ లో మ‌హేష్ నే మించిపోతున్నాడు అనిపిస్తుంది. ఇంకా గౌత‌మ్ కి ఎదిగే వ‌య‌సు ఉంది. అలా చూస్తే ఇంకా హైట్ అయిపోతాడేమో అన్న సందేహం రాక మాన‌దు. కుమార్తె కూడా ఎత్తుగానే క‌నిపిస్తుంది. ముగ్గురు క‌లిసి దిగిన ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి 2024 లో తొలి ఫ్యామిలీ డేట్ ఇది. ల‌వ్ ల‌వ్ అండ్ మోర్ ల‌వ్ స్టార్టింగ్ దిస్ ఇయ‌ర్ ఆన్ ఏ ల‌వ్ నోట్ అంటూ న‌మ్ర‌త రాసుకొచ్చారు.