పోలీస్ పాత్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్!
ఆయన కోరడంతోనే గౌతమ్ మీనన్ రంగంలోకి దిగుతున్నారు. అయితే ఇలా వరుసగా పోలీస్ పాత్రలే పోషిండంతో వాటిలో గౌతమ్ మాస్టర్ పీస్ లా మారిపోయారు.
By: Tupaki Desk | 29 May 2025 3:30 PMకొంత కాలంగా గౌతమ్ మీనన్ దర్శకత్వానికి కామా పెట్టి నటుడిగా కొనసాగుతుతోన్న సంగతి తెలిసిందే. నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్ర ఉందంటే? అది గౌతమ్ దే అన్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఆయన ఏ సినిమా చేసినా గౌతమ్ పోలీస్ యూనిఫాం పాత్రలోనో ఇన్వ స్టిగేటివ్ అధికారి పాత్రల్లోనే కనిపిస్తున్నారు.
'లియో' , 'విడుదల -2', 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్', 'బజూక్' తో పాటు మరో రెండు రీసెంట్ మలయాళం చిత్రాల్లో పోలీస్ గెటప్ లోనే కనిపించారు. విజయ్ హీరోగా నటిస్తోన్న 'జననాయగన్' లో కూడా పవర్ పుల్ పోలీస్ రోల్ అని సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా 'యూఫోరియా'లో కూడా ఇన్వస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు జయదేవ్ నాయర్. ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
ఆయన కోరడంతోనే గౌతమ్ మీనన్ రంగంలోకి దిగుతున్నారు. అయితే ఇలా వరుసగా పోలీస్ పాత్రలే పోషిండంతో వాటిలో గౌతమ్ మాస్టర్ పీస్ లా మారిపోయారు. ఒక భాషలో కాదు. తెలుగు, తమిళ్, మలయా ళం అన్ని భాషల్లోనూ ఒకే తరహా పాత్రలు రావడం విశేషం. అయితే ఈ పాత్రలకు గౌతమ్ మీనన్ పర్పెక్ట్ గా సూటవుతున్నారు. ఆయన ముఖంలో సీరియస్ నెస్... ఒంటిపై ఖాకీ యూనిఫాం ఆహార్యం అన్ని పక్కాగా కుదురుతున్నాయి.
దీంతో మేకర్స్ కూడా మరో ఆలోచన లేకుండా గౌతమ్ మీనన్ ఎంపిక చేస్తున్నారు. ఆ రకంగా గౌతమ్ మీనన్ నటుడిగా బిజీగా ఉన్నారు. డాక్టర్ పాత్రలు కూడా బాగానే వస్తున్నాయి. వాటికి బాగా సూటువు తున్నారు. డైరెక్టర్ గా సంపాదించే ఆదాయం నాలుగైదు సినిమాలతోనే సాధ్యమవుతుంది. అలాగని కెప్టెన్ కుర్చీ వదల లేదు. అవకాశం వస్తే అక్కడా సత్తా చాటుతున్నారు.