Begin typing your search above and press return to search.

గౌతం కృష్ణ సోలో బాయ్ ట్రైలర్ టాక్..!

బిగ్ బాస్ తో పాపులర్ అయిన గౌతం కృష్ణ లీడ్ రోల్ లో నవీన్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సోలో బాయ్.

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:00 PM IST
గౌతం కృష్ణ సోలో బాయ్ ట్రైలర్ టాక్..!
X

బిగ్ బాస్ తో పాపులర్ అయిన గౌతం కృష్ణ లీడ్ రోల్ లో నవీన్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సోలో బాయ్. ఈ సినిమాను సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ నుంచి సెవెన్ హిల్స్ సతీష్ నిర్మిస్తున్నారు. గౌతం కృష్ణ సరసన శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్ గా నటించారు. సోలో బాయ్ నుంచి అంతకుముందు వచ్చిన సాంగ్ యూత్ ని ఆకట్టుకోగా ఆ తర్వాత టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కూడా ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఎమోషన్స్, ఫెయిల్యూర్, సక్సెస్ అన్నీ చూపించారు.

సూటిగా చెప్పాలంటే గౌతం కృష్ణ సోలో బాయ్ సినిమా కంప్లీట్ మూవీగా వస్తుంది. సినిమాలో లవ్ ఎమోషన్ తో పాటు జీవితంలో ఏదో సాధించాలనే తపన.. ఎలాంటి కష్టమైనా ఎదుర్కొనే ధైర్యం ఇలా ప్రస్తుత యువతకి కావాల్సిన బూస్టింగ్ ఇచ్చేలా ఉన్నారు. ట్రైలర్ లో కన్ ఫ్లిక్స్ క్లారిటీ ఇవ్వకపోయినా అంతా ట్రైలర్ లో చెప్పేస్తే ఎలా అనుకున్నారో ఏమో కానీ గౌతం కృష్ణ సోలో బాయ్ ట్రైలర్ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ బిజిఎం ఇంప్రెస్ చేసింది. సాండీ మ్యూజిక్ అందిస్తున్న సోలో బాయ్ సినిమాకు త్రిలోక్ సిద్ధు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గౌతం కృష్ణ తన స్క్రీన్ నేం ముందు అశ్వద్ధామ అని పెట్టుకున్నాడు. బిగ్ బాస్ లో అతను మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అశ్వ్వద్ధామా ఈజ్ బ్యాక్ అని అంటూ నానా హంగామా చేశాడు. అదే తనని బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ దాకా తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో వస్తున్నాడు గౌతం కృష్ణ. కచ్చితంగా యూత్ ఆడియన్స్ నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి యువ హీరో చేస్తున్న ఈ అటెంప్ట్ ఆడియన్స్ కు నచ్చుతుందని చెప్పొచ్చు. గౌతం కృష్ణ సోలో బాయ్ సినిమాను జూలై 4న రిలీజ్ లాక్ చేశారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఊపందుకోనున్నాయి.

అంతకుముందు గౌతం కృష్ణ ఒక సినిమా చేశాడు. ఆ తర్వాత అతను బిగ్ బాస్ కి వెళ్లాడు. సో బిగ్ బాస్ ఇమేజ్ కూడా తోడైంది కాబట్టి ఈ సోలో బాయ్ సినిమాతో గౌతం కృష్ణ సక్సెస్ అవుతాడేమో చూడాలి. యాక్షన్ ప్యాక్ లవ్ స్టోరీ విత్ ఆల్ ఎమోషన్స్ గా వస్తున్న సోలో బాయ్ ఆడియన్స్ మనసులు గెలుస్తాడా లేదా అన్నది జూలై 4న తెలుస్తుంది.