Begin typing your search above and press return to search.

16ఏళ్ల కుమార్తెకు వైబ్రేట‌ర్ కానుక ఇచ్చిన న‌టి

చాలామంది మ‌హిళ‌లు ఆనందించ‌రు. నా త‌ల్లి నాకోసం చేయ‌నిది నేను నా కూతురికి చేస్తాను.

By:  Tupaki Desk   |   11 May 2025 11:30 PM
Gautami Kapoor Bold Gift Idea for Daughter
X

పెచ్చుమీరిన మ‌హిళా స్వేచ్ఛ‌, పాశ్చాత్య ధోర‌ణి, విశృంఖ‌ల‌త గురించి స‌నాత‌న‌ సాంప్ర‌దాయాల‌ను గౌర‌వించే కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం చూస్తున్నదే. వెస్ట్ర‌న్ క‌ల్చర్ లోని దూకుడు భార‌త‌దేశంలోని మారుమూల ప్రాంతాల‌కు కూడా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ యుగంలో ఓటీటీల్లో బోల్డ్ వెబ్ సిరీస్ లు యువ‌త‌కు చాలా నేర్పించాయి. ఇలాంటి స‌మ‌యంలో టెలివిజ‌న్ రంగంలోని ఒక న‌టి త‌న 16 ఏళ్ల కూతురి పుట్టిన‌రోజుకు సె* టాయ్ కానుక‌గా ఇవ్వాల‌ని భావించిన‌ట్టు ప్ర‌క‌టించడం ఎవ‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌లేదు.

ప్ర‌ముఖ బుల్లితెర న‌టి గౌత‌మి క‌పూర్ (న‌టుడు రామ్ క‌పూర్ భార్య‌) త‌న కూతురు సియా బ‌ర్త్ డేకి ఎలాంటి కానుక ఇవ్వాలో తీవ్రంగా ఆలోచించాన‌ని, చివ‌రికి సె* టాయ్ లేదా వైబ్రేట‌ర్ ఎందుకు ఇవ్వ‌కూడ‌దు? అని ఆలోచించాన‌ని తెలిపింది. త‌న కుమార్తె వ‌య‌సు ఇప్పుడు 19. త‌న ఆలోచ‌న‌ల‌ను స‌మ‌ర్థిస్తుంద‌ని, గౌర‌విస్తుంద‌ని కూడా గౌత‌మి తెలిపారు. అంతేకాదు.. అలాంటి కానుక‌లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దో ఇత‌ర త‌ల్లుల‌ను కూడా నిల‌దీస్తాన‌ని గౌత‌మి క‌పూర్ ప‌బ్లిగ్గా అన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

చాలామంది మ‌హిళ‌లు ఆనందించ‌రు. నా త‌ల్లి నాకోసం చేయ‌నిది నేను నా కూతురికి చేస్తాను. ఆనందం కోల్పోనివ్వ‌ను! అని బోళాగా మాట్లాడేసింది స‌ద‌రు సీనియ‌ర్ న‌టి. అయితే త‌న ఆనందానికి త‌న కూతురి ఆనందానికి ఎవ‌రూ అడ్డు చెప్ప‌డం లేదు. కానీ ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను బ‌హిరంగంగా ర‌చ్చ‌కెక్కేలా గ‌ట్టిగా ప‌బ్లిక్ వేదిక‌ల‌పై బ‌ల్ల గుద్ది చెప్పాలా? అని నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. భార‌త‌దేశంలో సె* టాయ్స్, వైబ్రేట‌ర్ల వ్యాపారం, నీలి చిత్రాల మార్కెట్ చాలా ఎత్తుకు ఎదిగాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి వేళ ఈ టీవీ న‌టి బోల్డ్ కామెంట్ ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.