కొట్టిన తర్వాత అతడే వచ్చేలా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయాల్సింది క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 3:51 PMమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయాల్సింది క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. స్టోరీ లాక్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా క్యాన్సిల్ అయింది. అందుకు చరణ్ కారణంగానే వినిపించింది. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతోనే ఇలా జరిగిందని ప్రచారం జరిగింది. ఈ కారణంగా గౌతమ్ తిన్ననూరికి చాలా సమయం వృద్ధా అయింది.
చరణ్ డేట్లు ఇస్తాడు? సినిమా తీయోచ్చని ఆశగా ఎదురు చూస్తోన్న సమయంలో జరిగిన సన్నివేశం ఇది. అప్పటికే చాలా సమయం వృద్దా అవ్వడంతో గౌతమ్ మెరుపె వేగంతో విజయ్ దేరకొండతో సినిమా ప్రారం భించాడు. అదే `కింగ్ డమ్`. ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో కింగ్ డమ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. గౌతమ్ మేకింగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. `మళ్లీ రావా`, `జెర్సీ` లాంటి క్లాసిక్ హిట్స్ తర్వాత న్యూ జానర్ లో చేస్తోన్న చిత్రమిది.
ఇలాంటి యాక్షన్ సినిమా ఇంతవరకూ గౌతమ కూడా ట్రై చేయలేదు. కొత్త అయినా అతడి మేకింగ్ లో ఎంతో అనుభవం కనిపిస్తుంది. ఓ కొత్త పాయింట్ ను కమ్శియల్ గా తీర్చి దిద్దినట్లు కనిపిస్తుంది. తొలి షోతో పాజిటివ్ టాక్ వచ్చిందంటే? కింగ్ డమ్ దుమ్ముదులిపేస్తుంది. మే చివరల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే చరణ్ గౌతమ్ వైపుకు రావాల్సిందే. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడు స్తోన్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా డైరెక్టర్లు ఉన్నది నలుగురైదుగురు మాత్రమే. `కింగ్ డమ్` సక్సస్ అయితే గౌతమ్ కూడా ఆ జాబితాలో చేరతాడు. రైటర్ గా, డైరెక్టర్ గా అతడికి మంచి పేరుంది కాబట్టి పాన్ ఇండియా కాన్సెప్ట్ లు అతడికి పెద్ద విషయం కాదు. ఏదైనా కింగ్ డమ్ సక్సెస్ గౌతమ్ తో పాటు హీరో విజయ్ కూడా అంతే అవ సరం. కొంత కాలంగా విజయ్ కూడా ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే.