Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో భార్య మార్కెట్ లో ఓ బ్రాండ్!

వివిధ వ్యాపారాల‌తో పాటు అమె ఎంతో ఫేమ‌స్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ కూడా. బాలీవుడ్ తారలతో పాటు వ్యాపారవేత్తలు.. వీఐపీల ఇళ్లను అందంగా డిజైన్ చేసారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 12:30 PM GMT
ఆ స్టార్ హీరో భార్య మార్కెట్ లో ఓ బ్రాండ్!
X

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ గురించి ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. బిజినెస్ ఉమెన్ గా గౌరీఖాన్ కి మంచి పేరుంది. షారుక్ ఖాన్ లాగే ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా కోట్లాది సంపదకు యజమాని. ఆమె ఆస్తి విలువ మొత్తం 1725 కోట్ల రూపాయలు. షారుక్ ఖాన్ ఆస్తి విలువ మొత్తం 760 మిలియన్ డాలర్లు కాగా గౌరీ ఖాన్ ప్రతి సంవత్సరం దాదాపు 100 కోట్లకు పైగా సంపాదిస్తుంది.

వివిధ వ్యాపారాల‌తో పాటు అమె ఎంతో ఫేమ‌స్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ కూడా. బాలీవుడ్ తారలతో పాటు వ్యాపారవేత్తలు.. వీఐపీల ఇళ్లను అందంగా డిజైన్ చేసారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, అనన్య పాండే ,కరణ్ జోహార్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లను గౌరీ డిజైన్ చేసింది. ముఖేష్ అంబానీ, రాబర్టో కావల్లి, రాల్ఫ్ లారెన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల ఇళ్లను కూడా డిజైన్ చేసి ఎంతో ఫేమ‌స్ అయింది.

కానీ గౌరీఖాన్ బేసిక్ గా బీఏ ప‌ట్ట‌బ‌ద్దురాలు. ఆపై ప్యాష‌న్ డిజైనింగ్ కోర్స్ చేసారు. తండ్రి గార్మెంట్స్ వ్యాపారం కావ‌డంతో టైల‌రింగ్ లో కూడా కొంత అనుభ‌వం ఉంది. అలాగ‌ని ఆమె ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ కాలేదు. షారుక్ కొనుగోలు చేసిన మ‌న్న‌త్ బంగ్లా కార‌ణంగా ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా మారిన‌ట్లు తెలుస్తోంది. మ‌న్న‌త్ పురాత‌న నిర్మాణం కావ‌డంతో దాన్ని పున‌ర్మించే ప్ర‌క్రియ‌లో భాగంగా గౌరీఖాన్ ఇంటీరియ‌ర్ డిజైనింగ్ కోర్స్ చేయ‌డం..మ‌న్న‌త్ ని డిజైన్ చేయ‌డంతో ఆమెలోని సృజ‌నాత్మ‌క‌త వెలుగులోకి వ‌చ్చింది.

మ‌న్న‌త్ ని ఆమె స్వ‌యంగా డిజైన్ చేయ‌డంతో బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో ఎంతో ఫేమ‌స్ అయ్యారు. మ‌న్న‌త్ ఇంటీరియ‌ర్ న‌చ్చ‌డంతో మిగ‌తా సెల‌బ్రిటీలు గౌరీఖాన్ తో డిజైన్ చేయించుకున్నారు. ఆ త‌ర్వాత ఇదే రంగంలో మ‌రింత అనుభ‌వాన్ని గౌరీఖాన్ సంపాదించి ఇండియాలోనే గ్రేట్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా ఖ్యాతికెక్కారు. ర‌క‌ర‌కాల ప్రాజెక్ట్ లు చేసి ఎంతో ఫేమ‌స్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ డిజైన‌ర్ల తో క‌లిసి ప‌నిచేసారు. అయితే సొంతంగా ఎదిగే క్ర‌మంలో చాలా ర‌కాల స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చిం ద‌ని గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ ప్రారంభ ధ‌ర 6 లక్ష‌ల నుంచి కోట్ల వ‌ర‌కూ ఉంటుందిట‌. ఇంటీ రియ‌ర్ డిజైన్స్ నెట్ వ‌ర్త్ 200 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని స‌మాచారం.