Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్ట‌ర్ + శంక‌ర్ దాదా=భోళా శంక‌ర్!

ఆదేంటో ఆయ‌న మాటల్లోనే.. 'గ్యాంగ్ స్ట‌ర్' సినిమాకి శంక‌ర్ 'దాదా ఎంబీబీఎస్' క‌లిస్తే ఎలా ఉంటుందో 'భోళా శంక‌ర్' అలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 7:02 AM GMT
గ్యాంగ్ స్ట‌ర్ + శంక‌ర్ దాదా=భోళా శంక‌ర్!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'భోళా శంక‌ర్' రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వారం రోజుల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమా పై భారీ అంచ‌నాలు క్రియేట్ చేస్తున్నాయి. మెగాస్టార్ లుక్ ఆద్యంతం హైప్ తీసుకొస్తుంది. చిరును కొత్త‌గానూ ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్లు అభిమానుల్లో అంచ‌నాలున్నాయి. తమిళ సినిమా 'వేదాళం' రీమేక్ అయినా తెలుగు నేటివిటీ..మెగా ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు క‌థ‌లో భారీ మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో సినిమా ఎలా ఉంటుందా? అన్న ఉత్సాహం అభిమానుల్లో రెట్టింపు అవుతోంది. ఈ నేప‌థ్యంలో సినిమా ఎలా ఉంటుంద‌న్న‌ది ఆ చిత్ర ఛాయాగ్రాహ‌కుడు డ‌డ్లీ హింట్ ఇచ్చేసారు. ఆదేంటో ఆయ‌న మాటల్లోనే.. 'గ్యాంగ్ స్ట‌ర్' సినిమాకి శంక‌ర్ 'దాదా ఎంబీబీఎస్' క‌లిస్తే ఎలా ఉంటుందో 'భోళా శంక‌ర్' అలా ఉంటుంది. ఒక‌ప్పటి చిరంజీవి ని సినిమాలో చూస్తారు. ఆయ‌న స్టైల్..ఇమేజ్ హైలైట్. కామెడీ టైమింగ్..పోరాట ఘ‌ట్టాలు ప్రేక్ష‌కుల‌ కు క‌నువిందుగా ఉంటాయి.

సినిమాలో ఆయ‌న యువ‌కుడిగా క‌నిపించ‌డ‌మే ప్ర‌త్యేక‌త‌. ఈ సినిమా ప్ర‌యాణంలో ఎక్కువ స‌వాల్ ఇచ్చిన అంశం ఏంటంటే? విరామంలో వ‌చ్చే స‌న్నివేశాలే. పెద్ద యాక్ష‌న స‌న్నివేశం అది. వేదాళం సినిమా లో ఆ స‌న్నివేశం చాలా బాగా తీసారు. దానికి ధీటుగా ఉంటూనే కొత్త‌గా ఉండేలా మేము ప్ర‌య‌త్నం చేసాం. విజువ‌ల్ గా సినిమా హైలైట్ అవుతుంది' అని అన్నారు.

మొత్తంగా 'భోళా శంక‌ర్' ఎలా ఉంటుంద‌న్న‌ది డ‌డ్లీ హింట్ ఇచ్చేసారు. చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప‌క్కా మాస్ సినిమాగా తెలుస్తోంది. ఆయ‌న డై హార్డ్ ఫ్యాన్స్ కి సినిమా థియేట‌ర్లో పూన‌కాలు తెప్పిస్తుంది. 'శంక‌ర్ దాదా ఎంబీబీఎస్' హిట్ అయింద‌నే ఆ త‌ర్వాత 'శంక‌ర్ దాదా జిందాబాద్' చేసారు. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే.