Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. టార్గెట్ ఫిక్స్ అయ్యింది

అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి

By:  Tupaki Desk   |   1 Jan 2024 7:03 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. టార్గెట్ ఫిక్స్ అయ్యింది
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రతి సినిమాతో కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి సినిమా చేసినా అందులో తన పాత్ర నెవ్వర్ బిఫోర్ లా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో కూడా డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి. కొన్ని స్టైలిష్ గా ఉంటే మరికొన్ని మాస్ గా ఉండబోతున్నాయి.


అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను గతేడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

ఇప్పుడు న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతోపాటు సినీ ప్రియులకు న్యూఇయర్ విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

ఈ మూవీ పోస్టర్లో ఓ పెద్ద గ్యాంగ్ కనిపిస్తోంది. విశ్వక్ సేన్ డిఫరెంట్ లుక్ మధ్యలో వినయంగా కూర్చున్నారు. పక్కనే ఓ పెద్దాయన విశ్వక్ భుజం తట్టినట్లు కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు సుట్టంలా సూసి అనే ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తైనట్లు ఇటీవలే విశ్వక్ సేన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కేవలం ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారు. ఈ మూవీ ప్రమోషన్లలో కచ్చితంగా పాల్గొంటానని వెల్లడించారు. సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

మరోవైపు VS10లో కూడా నటిస్తున్నారు విశ్వక్‌ సేన్. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీంతోపాటు అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గామి డబ్బింగ్ ను కూడా ఇటీవలే పూర్తి చేశారు. మరి విశ్వక్ కొత్త సినిమాలు ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.