Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఎందుకు లేటు?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:26 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఎందుకు లేటు?
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది దాస్ కా ధమ్కీ మూవీతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో.. ఈ ఏడాది మూడు చిత్రాలతో సందడి చేయనున్నారు. నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న గామి మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. శివరాత్రి కానుకగా మార్చి 8న సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అయితే విశ్వక్ సేన్ నటిస్తున్న మరో చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాను మార్చి 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఆ మూవీ మేకర్స్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీనే గామి సినిమా రిలీజ్ అవ్వనుంది. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడినట్లే. ఇక సినిమా ఏప్రిల్ లో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ మళ్లీ ఎందుకు వాయిదా పడిందంటే?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి కొన్ని నెలల క్రితం.. విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ మూవీకి సంబంధించి 15 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారు. ఫిబ్రవరిలో షూట్ కంప్లీట్ చేసి మార్చిలో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ మధ్య తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాతో ఐటం సాంగ్ షూట్ ను స్టార్ట్ చేసి రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ తో ఐటం సాంగ్ ను పూర్తి చేశారు మేకర్స్.

ఇక పెండింగ్ ఉన్న హీరో ఫైట్ సీక్వెన్స్ తోపాటు మిగతా షూటింగ్ పార్ట్ ను కూడా మేకర్స్ పూర్తి చేశారు. దీంతో అనుకున్న తేదీకి ఈ సినిమా రిలీజ్ అవుద్దని అంతా భావించారు. ఇంతలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె భవతరణి కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇళయారాజా కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ కాస్త పెండింగ్ ఉందట. దాన్ని కంప్లీట్ చేయడానికి యువన్ శంకర్ రాజా కాస్త టైమ్ కావాలని అడిగారట. అయితే విషాదంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టకూడదని.. విశ్వక్ ఈ మూవీ విడుదల వాయిదాకు అంగీకరించారట. ఇక ఈ మూవీని సోలోగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. మంచి డేట్ కోసం సెర్చ్ చేస్తున్నారట. మార్చి 29న టిల్లు స్క్వేర్, ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ఉండడంతో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.