Begin typing your search above and press return to search.

విశ్వక్ 'మోత'.. గోదారోళ్లతో మాములుగా ఉండదు!

ఏ హీరో కూడా చేయడానికి సాహసించని అఘోర పాత్రలో నటించి తన యాక్టింగ్ తో శభాష్ అనిపించుకున్నారు.

By:  Tupaki Desk   |   22 March 2024 5:15 PM GMT
విశ్వక్ మోత.. గోదారోళ్లతో మాములుగా ఉండదు!
X

విశ్వక్ సేన్.. ఈ టాలీవుడ్ యంగ్ హీరో సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. మల్టీ టాలెంటెడ్ గా సినీ ప్రియులను అలరిస్తున్నారు. తన గ్రాఫ్ ను పెంచుకుంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టేశారు. ఏ హీరో కూడా చేయడానికి సాహసించని అఘోర పాత్రలో నటించి తన యాక్టింగ్ తో శభాష్ అనిపించుకున్నారు.

ఇప్పటి వరకు తాను నటించిన అన్ని సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ తో అలరించిన విశ్వక్ సేన్.. ఇప్పుడు తన కొత్త మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గోదారోళ్ల యాసలో అదరగొట్టనున్నారు. అందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట విశ్వక్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే17వ తేదీన ఈ మూవీ విడుదలవనుంది.

ఇక ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉందని తెలిసి.. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆ పాట కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సాంగ్ లో విశ్వక్ సేన్ తో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ ఆడిపాడింది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ పూర్తైంది. తాజాగా ఈ సాంగ్ అప్డేట్ వచ్చింది. మార్చి 25వ తేదీన ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చెబుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మోత మోగిపోద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

పోస్టర్ లో విశ్వక్ సేన్, ఆయేషా ఖాన్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. వైలెట్ కలర్ చొక్కా, నోటిలో బీడీతో విశ్వక్ అదిరిపోయారు. ఫేస్ లో మాస్ ఎక్స్ ప్రెషన్స్ వేరే లెవల్ లో ఉన్నాయి. ఇక ఆయేషా ఖాన్.. వైట్ కలర్ శారీలో మాయ చేస్తుంది. నాభి పైన వడ్డాణం, సన్నని పైటతో ఫిదా చేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. నడుము వయ్యారాలతో స్టెప్పులు వేస్తూ అదరగొడుతోంది. నవ్వుతోనే అందరినీ బౌల్డ్ చేస్తోంది.

ఇక ఈ పిక్ చూసి మోత సాంగ్.. ఫుల్ ఫేమస్ అవ్వడం పక్కా అని నెటిజన్లు చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హోలీ స్పెషల్ గా సికింద్రాబాద్ లోని జేబీఎస్ కంటోన్మెంట్ పార్క్ లో విడుదల చేయనున్నారు. ఈ పాటకు ఆస్కార్ విన్నింగ్ గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. యువన్ శంకర్ రాజా బాణీలు కట్టారు. అయితే స్పెషల్ సాంగ్స్ కు సంథింగ్ స్పెషల్ బాణీలు ఇవ్వడంలో యువన్ దిట్ట. మరి ఈ మోత సాంగ్ కు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో, ఆ పాట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.