Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ సలహాతో డిజాస్టర్!

ఇక రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో దిఘోస్ట్ అనే మూవీ చేశారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:09 AM GMT
రామ్ చరణ్ సలహాతో డిజాస్టర్!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ చిత్రం ట్రైలర్ బాగున్నా కూడా జనాల్లోకి పాజిటివ్ వైబ్ ని తీసుకెళ్లడంలో, అలాగే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో విఫలం అయ్యింది. దీంతో ఈ చిత్రానికి వరుణ్ తేజ్ కెరియర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. గని సినిమాకంటే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా గాండీవదారి తక్కువ కలెక్ట్ చేయడం విశేషం.

ఇక రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో దిఘోస్ట్ అనే మూవీ చేశారు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే గాండీవదారి అర్జున కథ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ కాలేదు. దీంతో ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజుకి ఏ మాత్రం పుంజుకోలేదు. దీంతో వరుణ్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచిందని చెప్పొచ్చు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. మార్కెట్ లెక్కలు వేసుకోకుండా కొత్త కథలతో మూవీస్ చేస్తూ ఉండాలని రామ్ చరణ్ తనకి సలహా ఇచ్చాడని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. చెర్రీ ఇచ్చిన సలహా కరెక్ట్ అనిపించి కొత్త స్టోరీస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు గాండీవదారి అర్జున కథ ప్రవీణ్ సత్తారు చెప్పడంతో ఒకే చెప్పేసానని అన్నారు.

అయితే ఈ మూవీ చూసిన తర్వాత కథలో కొత్తదనం ఉందని ఎవరూ అన్నారు. అందరికి తెలిసిన కథనే కాస్తా క్లైమేట్ కి ముడిపెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. హీరో, విలన్ టామ్ అండ్ జెర్రీ తరహాలోనే ఈ స్టోరీ కూడా ఉంటుంది. అయితే ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశాలు లేకపోవడంతో డిజాస్టర్ అయ్యింది. రామ్ చరణ్ ఇచ్చిన సలహాలు వరుణ్ కి విషయంలో వర్క్ అవుట్ అవ్వలేదని గాండీవదారి మూవీ ఫెయిల్యూర్ తర్వాత కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

కచ్చితంగా థియేటర్స్ లో సక్సెస్ కొట్టాలంటే మార్కెట్ లెక్కలు అర్ధం చేసుకొని ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయి. మన నుంచి ఎలాంటి కథలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ తెచ్చుకొని మూవీస్ చేస్తే వర్క్ అవుట్ అవుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలా కాకుండా ప్రేక్షకుల అభిరుచితో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తే ఉన్న మార్కెట్ కోల్పోయే ప్రమాదం ఉందనే మాట వినిపిస్తోంది. మరి వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ విషయంలో స్ట్రాటజీ మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి.