Begin typing your search above and press return to search.

గామి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

అఘోర శంకర్ పాత్రలో కనిపించిన విశ్వక్.. తన యాక్టింగ్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 12:20 PM GMT
గామి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
X

ఎన్నో ఏళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న గామి మూవీ.. ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ మెయిన్ రోల్ లో నటించిన ఈ సినిమా.. శివరాత్రి కానుకగా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఘోర శంకర్ పాత్రలో కనిపించిన విశ్వక్.. తన యాక్టింగ్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.

విశ్వక్ సేన్ గామి సినిమాకు మూవీ లవర్స్ తోపాటు సినీ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారంటూ చాలా మంది మెచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టిన గామి చిత్రం.. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే గామి సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. ఫేమస్ టికెట్ సెల్లింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి గామికి 1/10 రేటింగ్ ఇస్తున్నట్లు విశ్వక్ ఫాన్స్ గుర్తించారు. దీంతో బుక్ మై షోలో ఈ సినిమా రేటింగ్ 8.3కి పడిపోయింది. ఇది కావాలనే కొంతమంది చేస్తున్నట్లు విశ్వక్ ఫాన్స్ ఆరోపిస్తున్నారు.

ఈ సమస్య గామికి మాత్రమే కాదు.. ఇంతకుముందు కూడా పలు టాలీవుడ్ చిత్రాలకు ఇలాంటి ప్రాబ్లమ్సే ఎదురయ్యాయి. కావాలనే బుక్ మై షోలో రేటింగ్‌ ను తక్కువగా ఇచ్చి, సినిమాలపై నెగిటివిటీని పెంచి ఆడియెన్స్ ను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి కొన్ని ఫేక్ అకౌంట్లు. గతంలో విజయ్ దేవరకొండ ఖుషి, మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలకు ఇలానే జరిగింది.

గుంటూరు కారం విషయంలో ఆ సినిమా మేకర్స్ చాలా సీరియస్‌ గా తీసుకున్నారు. చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. బుక్ మై షోకు వెంటనే నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ గామి విషయంలో కూడా ఇలానే జరగడంతో సినీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.