Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. చరణ్ సాలిడ్ గానే..

మధ్యలో చాలా బ్రేకుల పడ్డ ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   23 April 2024 10:30 AM GMT
గేమ్ ఛేంజర్.. చరణ్ సాలిడ్ గానే..
X

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. మధ్యలో చాలా బ్రేకుల పడ్డ ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం చివర దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో గేమ్ ఛేంజర్ మూవీ కీలక షెడ్యూల్ షూటింగ్ జరగ్గా.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరపనున్నారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ రిలీజ్ అవ్వగా.. మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రివీల్ చేస్తూ.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని టాక్.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని అప్పుడెప్పుడో నిర్మాత దిల్ రాజు చెప్పారు. కానీ ఇటీవల రామ్ చరణ్.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మూవీ విడుదల అవుతుందని తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఓజీ, జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో అక్టోబర్ చివరలో దీపావళి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకు గాను రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి చరణ్ భారీగా పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ముందు అనుకున్న దాని కంటే ఎక్కువగానే తీసుకుంటున్నారట. మొత్తంగా రూ.120 కోట్లు అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, నవీన చంద్ర, తెలుగమ్మాయి అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో చూడాలి.