Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఆ ట్రెండ్ సెట్టర్ సినిమాతో పోలిక!

ఈ కారణంగానే గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం గురించి ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:14 AM GMT
గేమ్ ఛేంజర్.. ఆ ట్రెండ్ సెట్టర్ సినిమాతో పోలిక!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు, జీస్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథ అందించడం విశేషం. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అంజలి సెకండ్ లీడ్ లో కనిపించబోతోందని తెలుస్తోంది. అలాగే శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఎస్.జె.సూర్య మూవీలో పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడంట. శంకర్ ఓ వైపు ఇండియన్ 2 చేస్తూ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తూ వస్తున్నాడు. అందుకే షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. అవుట్ ఫుట్ విషయంలో ఖర్చు ఎక్కువ అయిన శంకర్ ఎక్కడా రాజీపడరు అనే టాక్ ఉంది.

ఈ కారణంగానే గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం గురించి ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. శంకర్ సూపర్ హిట్ మూవీ ఒకే ఒక్కడు తరహాలో గేమ్ చేంజర్ ఉంటుందంట. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తండ్రి పాత్ర వింటేజ్ స్టైల్ లో రాజకీయ నాయకుడిగా ఉండబోతోంది.

కొడుకు పాత్ర ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ రెండు పాత్రలు డిఫరెంట్ టైం లైన్ లో ఉంటాయని టాక్. రాజకీయాల చుట్టూ ఈ మూవీ కథాంశం తిరుగుతుందంట. అందుకే ఒకే ఒక్కడు తరహాలో గేమ్ చేంజర్ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. రామ్ చరణ్ ఇప్పటికే నాయక్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడు. మరల ఇన్నేళ్ల తర్వాత గేమ్ చేంజర్ లో రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా లెవల్ లో వస్తోన్న మూవీ ఇదే కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది. అయితే రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. మే ఆఖరుకి మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. తరువాత రిలీజ్ పై స్పష్టత ఇస్తారేమో వేచి చూడాలి.