Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది.

By:  Tupaki Desk   |   26 March 2024 4:20 AM GMT
గేమ్ చేంజర్.. ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరో నెల, రెండు నెలల్లో RC16 మూవీ షూటింగ్ మొదలు కానుంది. శంకర్ కూడా గేమ్ చేంజర్ వేగంగా పూర్తి చేసి రిలీజ్ డేట్ పై ఫోకస్ పెట్టే పనిలో ఉన్నారు. ఇండియన్ 2 ఆగష్టులో రిలీజ్ కన్ఫర్మ్ అయిపొయింది. గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంతకాలం పడుతుందనేది అంచనాకి వచ్చి రిలీజ్ పై క్లారిటీ ఇవ్వొచ్చని అనుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పూర్తిస్థాయిలో సోలో హీరోగా చేస్తోన్న మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తోన్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. దీంతో గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజు ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.

ఇదిలా ఉంటే మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆ రోజున గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా వినిపిస్తోన్న ప్రచారం బట్టి గేమ్ చేంజర్ నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ గా సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందంట. అలాగే బర్త్ డే టీజర్ కూడా రావచ్చని రకరకాల గాసిప్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. ఇక సాంగ్ ఎప్పుడో విడుదల కావాల్సింది.

జరగండి అనే ఆ సాంగ్ ముందుగానే లీక్ అవ్వగా పెద్దగా బజ్ క్రియట్ కాలేదు. కానీ ఇప్పుడు మేకర్స్ మాత్రం అదే సాంగ్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక పుట్టినరోజు గేమ్ ఛేంజర్ టీమ్ మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అని చెప్పవచ్చు.

ఇక థమన్ నుంచి రాబోతున్న పెద్ద పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో సాంగ్స్ ఎలా ఇచ్చాడనేది తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. గతంలో జరగండి అంటూ కంపోజ్ చేసిన సాంగ్ లీకైంది. బర్త్ డే కానుకగా అదే పాటని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. అలాగే సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే RC17 సినిమాని హొలీ సందర్భంగా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ కి సంబందించిన లుక్ ఏమైనా మైత్రీ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. బర్త్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ కి సంబందించిన అప్డేట్స్ అయితే తెలిసే అవకాశం ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.