Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. జరగండి కోసం కొన్నాళ్లు ఆగండి..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తారాస్థాయి అంచనాలతో వస్తున్న సినిమా గేమ్ చేంజర్.

By:  Tupaki Desk   |   11 Nov 2023 7:18 AM GMT
గేమ్ చేంజర్.. జరగండి కోసం కొన్నాళ్లు ఆగండి..!
X

మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తారాస్థాయి అంచనాలతో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ జరగండి దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సాంగ్ ను రిలీజ్ చేయడం కుదరట్లేదని మేకర్స్ ప్రకటించారు. గేమ్ చేంజర్ సినిమా నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుందని ఎస్.వి.సి బ్యానర్ ప్రకటించింది.


అయితే సినిమా అంతటా మీకు బెస్ట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటనలో రాసుకొచ్చారు. చరణ్ ఫ్యాన్ అండ్ శంకర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సాంగ్ రిలీజ్ కొత్త డేట్ ని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. గేమ్ చేంజర్ సినిమా కు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రెహమాన్ కాకుండా శంకర్ మొదటిసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేస్తున్నారు.


ఈ సినిమా సాంగ్స్ విషయంలో మేకర్స్ పెద్ద ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. శంకర్ సినిమాల్లో సాంగ్స్ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. జరగండి సినిమాలో కూడా అదే రేంజ్ లో సాంగ్స్ ఉంటాయని తెలుస్తుంది. స్టార్ సినిమా ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఈ దీపావళికి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ మళ్లీ మెగా ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. గేమ్ చేంజర్ విషయంలో ఒకటి కాదు దాదాపు ఇలా రెండు సార్లు సాంగ్ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా విషయంలో ప్లానింగ్ ఎలా ఉందో తెలియదు కానీ ఇలా సాంగ్స్ రిలీజ్ పోస్ట్ పోన్ అవడం మాత్రం ఫ్యాన్స్ ని చాలా డిజప్పాయింట్ చేస్తుంది. గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శ్రీకాంత్, సునీల్, ప్రభు ఇంకా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. 2024 సమ్మర్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.