Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

పోలీస్ వారు ఈ లీక్ కి సంబందించిన దర్యాప్తు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 9:08 AM GMT
గేమ్ చేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
X

స్టార్ హీరో సినిమా అంటే చాలు ఆ ప్రాజెక్ట్ కి ఉండే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రతి అభిమాని తమ హీరో నటిస్తున్న సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ వినాలని, చూడాలని అనుకుంటాడు. అలాంటి వారి కోసం కొందరు లీక్ రాయుళ్లు స్టార్ సినిమాల నుంచి ఫోటోలు, సాంగ్ బిట్స్ లీక్ చేస్తుంటారు. ఇది చేసేది చిత్ర యూనిట్ లో ఉన్న వారేనా లేక బయటవారా అన్నది తెలియదు కానీ స్టార్ సినిమాలకు ఏదో ఒక చోట ఏదో ఒక లీక్ జరుగుతూనే ఉంటుంది. దర్శక నిర్మాతలు ఎంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు వహించినా సరే ఈ లీకులు అనేవి జరుగుతూనే ఉన్నాయి.


ఒక్కసారి లీక్ అయ్యాక అఫీషియల్ గా ఫలానా టైం కి గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకున్న సాంగ్స్ కూడా హడావిడిగా రిలీజ్ చేసే పరిస్థితి వస్తుంది. రీసెంట్ గా గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ట్యూన్ అఫీషియల్ రిలీజ్ కి ముందే లీక్ అయ్యింది. చేసేదేమి లేక మేకర్స్ అఫీషియల్ గా ఆ ట్యూన్ రిలీజ్ చేశారు. అయితే ఫుల్ సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాం చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి కూడా జరగండి సాంగ్ లీక్ చేశారు.

శంకర్ డైరెక్షన్ లో రాం చరణ్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాలోని సాంగ్ లీక్ అవ్వడంతో మేకర్స్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సినిమా సాంగ్ లీక్ ని సైబర్ క్రైం పోలీసులకు అప్పగించారు. పోలీస్ వారు ఈ లీక్ కి సంబందించిన దర్యాప్తు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. థమన్ సినిమాలకే ఈ సాంగ్స్ లీక్స్ జరుగుతున్నాయి. శంకర్ తో థమన్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాడు. సాంగ్స్ విషయంలో సరికొత్త థమన్ చూస్తారని మేకర్స్ చెబుతున్నారు.

RRR తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమాగానే కాకుండా శంకర్ లాంటి డైరెక్టర్ తో చరణ్ చేస్తున్న ఫస్ట్ మూవీగా ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శ్రీకాంత్, సునీల్, ప్రభు ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు. తన ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ తో వచ్చే శంకర్ చరణ్ సినిమాలో కూడా అలాంటి పాయింట్ తోనే చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదు. 2024 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ ఉందని టాక్.