Begin typing your search above and press return to search.

గేమ్​ఛేంజర్ సాంగ్ క్యాన్సిల్​.. అసలు కారణం ఇదే!

ముఖ్యంగా తమన్ పేరు వినిపిస్తోంది. ఆ పాటను ఆయనే కంపోజ్ చేస్తున్నారు. ఆయన సాంగ్​కు సంబంధించి ఫైనల్​ మిక్స్​ మాస్టరింగ్​ పూర్తి చేయలేదని తెలిసింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 7:26 AM GMT
గేమ్​ఛేంజర్ సాంగ్ క్యాన్సిల్​.. అసలు కారణం ఇదే!
X

మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​ నటిస్తున్న భారీ బడ్జెట్​ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా గేమ్​ ఛేంజర్​. ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్​ కూడా లేక ఎంతగానో ఫీల్​ అవుతున్న అభిమానులకు మరోసారి బాధ కలిగించే వార్త అందింది. దసరాకు సినిమాలోని ఫస్ట్ సింగిల్​ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. అయితే అందుకు గల కారణం ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందరూ సంగీత దర్శకుడు తమన్​వైపే వేలు చూపించడం ప్రారంభించారు.

వివరాళ్లోకి వెళితే.. 'ఆర్ఆర్​ఆర్​' వంటి బిగ్గెస్ట్​ పాన్ ఇండియా హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. డైరెక్టర్​ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఏ రేంజ్​లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. కంప్లీట్ పొలిటికల్ యాక్షన్​ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

అలానే ఎటువంటి అప్డేట్స్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో ఆ మధ్యలో సాంగ్​ లీక్ అవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు దసరా పండక్కు ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేస్తారంటూ ప్రచారం సాగడం కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడది ఆవిరైపోయింది. సాంగ్​ రిలీజ్ చేయట్లేదని తెలిసింది. దీనిపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తమన్ పేరు వినిపిస్తోంది. ఆ పాటను ఆయనే కంపోజ్ చేస్తున్నారు. ఆయన సాంగ్​కు సంబంధించి ఫైనల్​ మిక్స్​ మాస్టరింగ్​ పూర్తి చేయలేదని తెలిసింది. ఆయన గత కొద్ది రోజులుగా భగవంత కేసరి సినిమాతో పాటు.. ఓటీటీ రానున్న ఓ సినిమా కోసం ట్రాక్స్​ రెడీ చేసి పంపే పనిలోనూ బిజీగా ఉన్నారట.

అందుకే ఆయన గేమ్​ ఛేంజర్​లోని సాంగ్​కు సంబంధించి కేవలం తెలుగు వెర్షన్​ మాత్రమే రెడీ చేశారట. హిందీ, తమిళం పూర్తి కాలేదట. మేకర్స్​.. అన్నీ భాషల్లో సాంగ్స్​ను రెడీ చేశాకే వదలాలని నిర్ణయించుకున్నారట. అందుకే దసరాకు రిలీజ్​ చేయట్లేదని తెలిసింది.