Begin typing your search above and press return to search.

ఆర్ ఎఫ్ సీ లో గేమ్ ఛేంజర్ యాక్ష‌న్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Feb 2024 6:10 AM GMT
ఆర్ ఎఫ్ సీ లో గేమ్ ఛేంజర్ యాక్ష‌న్
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 70 -80 శాతానికి పైగా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం శంక‌ర్ పెండింగ్ షూటింగ్ పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. దీనిలో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కీల‌క షెడ్యూల్ జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది.

ఇక్క‌డ ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు. అన్బ‌రిన్ నేతృత్వంలో కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. మార్చి తొలివారం వ‌ర‌కూ ఇవే స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలిసింది. ఈ షెడ్యూల్ కూడా రీసెంట్ గానే మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. షూటింగ్ బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో టీమ్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌డం లేదు. చిత్రీక‌ర‌ణ అంతా సైలెంట్ గానే కానిచ్చేస్తున్నారు.

చ‌ర‌ణ్...నిర్మాత దిల్ రాజు శంక‌ర్ చెప్పిన‌ట్లు చేయ‌డం త‌ప్ప‌! ఇద్దరికీ పెద్ద‌గా స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు కూడా క‌నిపించ‌లేదు. సాధార‌ణంగా దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారంటే? ఆయ‌న ఇన్వాల్వ్ మెంట్ అధికంగా ఉంటుంది. అవ‌స‌ర‌మైతే క‌థ‌లోనూ క‌ల్పించుకుంటారు. కానీ గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో రాజుగారు ఏ ర‌క‌మైన‌ ఛాన్స్ తీసుకోలేదు. అన్ని శంక‌ర్ పైనే వేసేసారు. ఆయ‌న ఎప్పుడు షూటింగ్ పూర్తి చేస్తే అప్పుడు? ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వ‌స్తుంద‌ని ప‌బ్లిక్ గానే చెప్పేసారు.

అప్ప‌టి నుంచి గేమ్ ఛేంజ‌ర్ అప్ డేట్స్ గురించి అభిమానులు రాజుగార్ని అడ‌గ‌డం కూడా మానేసారు. నాటి నుంచి చ‌ర‌ణ్ లేదా శంక‌ర్ మాత్ర‌మే అప్ డేట్స్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. వాళ్లు మాత్రం మౌనం వ‌హిస్తున్నారు. ఈ సినిమా షూట్ ని వీలైనంత త్వ‌రగా పూర్తి చేయాల‌ని చ‌ర‌ణ్ కూడా తొంద‌ర ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. బుచ్చిబాబు స్టోరీ స‌హా అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. చ‌ర‌ణ్ రావ‌డ‌మే ఆల‌స్యం. షూటింగ్ కి వెళ్ల‌డానికి సిద్దంగా ఉన్నాడు. దీంతో చ‌ర‌ణ్ కూడా అంతే సీరియ‌స్ గా క‌నిపిస్తున్నారు.