Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఇప్పుడు మరో సమస్య!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 April 2024 7:36 AM GMT
గేమ్ ఛేంజర్.. ఇప్పుడు మరో సమస్య!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసుకోలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గతంలో ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు చెప్పగా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా గేమ్ ఛేంజర్ అప్డేట్, రిలీజ్ డేట్ గురించి తనను అడగొద్దని దిల్ రాజు తెలిపారు. సినిమాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం శంకర్ కు మాత్రమే ఉందని చెప్పారు. ఆయనే రిలీజ్ డేట్ తోపాటు ప్రమోషన్ల గురించి చెబుతున్నారని అన్నారు.

ఇక రామ్ చరణ్.. ఇటీవల చెన్నైలో గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. తాను ఫస్ట్ టైమ్ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నానని, మొత్తం ఐదు భాషల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ఓజీ, అక్టోబర్ లో దసరా కానుకగా జూనియర్ ఎన్టీఆర్ దేవర విడుదల కానున్నాయి.

దీంతో గేమ్ ఛేంజర్.. అక్టోబర్ చివర్లో దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టియాన్ (తెలుగులో వేటగాడు) మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. టీజీ జ్ఞాన్ వేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. దీపావళి స్పెషల్ గా విడుదల తేదీ లాక్ చేసుకున్నట్లు సమాచారం. అలా అయితే గేమ్ ఛేంజర్ కు గట్టి పోటీ ఎదురవుతుంది.

వెట్టియాన్ డేట్ ఫిక్స్ అయితే.. గేమ్ ఛేంజర్ మూవీని రామ్ చరణ్ చెప్పినట్లే అక్టోబరు చివర్లో రిలీజ్ చేస్తారో లేక డిసెంబర్ కు మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారో అనేది వేచి చూడాలి. ఈ సినిమా తర్వాత చరణ్.. RC16 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రూరల్ కుర్రాడిగా చరణ్ కనిపించనున్నారు. ఆ తర్వాత సుకుమార్ తో మరో చిత్రం చేయనున్నారు. మరి రామ్ చరణ్ వరుస చిత్రాలు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.