Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. లాభం లేదని..

అయితే శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మూవీతో పాటు గేమ్ చేంజర్ చేస్తూ ఉండటం వలన భాగా ఆలస్యం అవుతోంది.

By:  Tupaki Desk   |   20 Dec 2023 9:30 AM GMT
గేమ్ ఛేంజర్.. లాభం లేదని..
X

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మూవీతో పాటు గేమ్ చేంజర్ చేస్తూ ఉండటం వలన భాగా ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.

కాని ఇప్పటి వరకు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది నిర్మాత దిల్ రాజుకి సైతం క్లారిటీ లేదు. కొంత మంది దర్శకులని సినిమా రిలీజ్ విషయంలో కంగారు పెట్టకూడదని, వారు పెర్ఫెక్షన్ కోసం చూస్తారని, అది వచ్చేవరకు చేస్తారని దిల్ రాజు ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. దీనిని బట్టి గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అనేది శంకర్ డిసైడ్ చేయాల్సిందే.

ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి అనే డ్యూయెట్ సాంగ్ లీకై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. క్వాలిటీ ఆడియోతో సోషల్ మీడియాలోకి వచ్చి సాంగ్ వైరల్ అయ్యింది. తరువాత కొద్ది రోజులకి చిత్ర యూనిట్ రియాక్ట్ అయ్యి ఈ సాంగ్ ని తొలగించగలిగారు.

అలాగే లీక్ చేసిన వారిపైన యాక్షన్ తీసుకున్నారు. సాంగ్ కి ఆ సమయంలో కొంత మంది నుంచి భాగుందనే అభిప్రాయం వచ్చింది. మరికొంత మంది సోసోగా ఉందని కామెంట్స్ చేశారు. ఎలాగూ లీక్ అయిపోయింది కాబట్టి అఫీషియల్ గా రిలీజ్ చేద్దామని దిల్ రాజు టీం భావించింది. సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉండటంతో ప్రయోజనం ఉండదని మళ్ళీ సాంగ్ రిలీజ్ పై సైలెంట్ అయిపోయారు.

తరువాత ఇప్పటి వరకు ఈ జరగండి సాంగ్ మీద మళ్ళీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే లీక్ అయ్యి జనాల్లోకి వెళ్ళిపోయిన సాంగ్ కావడంతో ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు కోరుతున్నారు. అయితే శంకర్ మాత్రం గేమ్ చేంజర్ రిలీజ్, ప్రమోషన్స్ విషయంలో క్లారిటీగా ఉన్నారని, పెర్ఫెక్ట్ గా రిలీజ్ టైంకి మరింత బెటర్ వెర్షన్ తో జరగండి సాంగ్ ని ఆడియన్స్ కి అందిస్తారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.