Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. మళ్ళీ స్పీడ్ పెంచేలా..

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా నెక్స్ట్ షెడ్యూ ల్ నవంబర్ 23న మైసూర్లో మొదలుకానుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:15 PM GMT
గేమ్ ఛేంజర్.. మళ్ళీ స్పీడ్ పెంచేలా..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదల విషయంలో పెద్దగా క్లారిటీ రాకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన గాసిప్స్ మాత్రం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. దర్శకుడు శంకర్ మరొకవైపు ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడంతో రామ్ చరణ్ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక మొత్తానికే రీసెంట్ గా అయితే ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులన్నీ ఫినిష్ అయ్యాయి. కొన్ని పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అంతే కాకుండా ఆ సినిమా విడుదల విషయంలో కూడా శంకర్ ఒక క్లారిటీతో ఉన్నాడు. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాపై ఆయన పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతూ ఉన్నారు.

దిల్ రాజు కూడా శంకర్ ప్లానింగ్ కు తగ్గట్టుగా షూటింగ్ పూర్తి చేస్తూ వస్తున్నారు. అలాగే మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబుతో RC16 సినిమాను వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా చరణ్ మెకోవర్ చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే గేమ్ ఛేంజర్ పనులు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో RC 16 పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడు.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా నెక్స్ట్ షెడ్యూ ల్ నవంబర్ 23న మైసూర్లో మొదలుకానుంది. ఇక దర్శకుడు శంకర్ ఈ షెడ్యూల్లో కీలకమైన కొన్ని పొలిటికల్ సన్నివేశాలను ఫినిష్ చేయబోతున్నాడు. సినిమాలో ఆ సీన్స్ చాలా కీలకమైనవి అని తెలుస్తోంది. అందుకే శంకర్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ను 2024 ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలి అని రామ్ చరణ్ ఇప్పటికే దర్శకుడికి నిర్మాతకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే శంకర్ కూడా వేగంగా సినిమా పనులను పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 2024 మార్చి నెలలోనే బుచ్చిబాబు సినిమాను రామ్ చరణ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.