Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ కు మరో దెబ్బ

రామ్ చరణ్ రీసెంట్ గా గాయపడ్డాడట. ఈ గాయం కారణంగానే మూవీ షూటింగ్ వాయిదా పడిందట.

By:  Tupaki Desk   |   25 Sep 2023 8:10 AM GMT
గేమ్ ఛేంజర్ కు మరో దెబ్బ
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అల్లు సీతారామ రాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన నటనకు నార్త్ జనాలు కూడా ఫిదా అయిపోయారు. ఈ మూవీలో ఓ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీ తర్వాత, ఆయన నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.

శంకర్ దర్వకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు శరవేగంగా జరిగింది. మరో షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సడెన్ గా వాయిదా పడింది.

రామ్ చరణ్ రీసెంట్ గా గాయపడ్డాడట. ఈ గాయం కారణంగానే మూవీ షూటింగ్ వాయిదా పడిందట. చరణ్ ముఖంపై గాయం అయ్యిందట. దాని నుంచి కోలుకోవడానికి వైద్యులు కొంత కాలం రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఈ కారణంగా మూవీ షూటింగ్ ని కాన్సిల్ చేశారు. ఆయన కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుకానుంది.

ఇక, ఈ మూవీ పాన్ ఇండియా సినిమా గా విడుదల చేయనున్నారు. చరణ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేయాలని మూవీ టీమ్ అనుకుంటోందట. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది.

కాగా, ఇది చరణ్ 15వ చిత్రం. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఓ ప్రముఖుని బయోపిక్ అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.