Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు..!

ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న మెగా మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Jan 2024 11:30 AM GMT
గేమ్ చేంజర్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు..!
X

ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న మెగా మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఆయన మార్క్ సామాజిక అంశాలతో వస్తుందని తెలుస్తుంది. పాన్ ఇండియా ఆడియన్స్ అందరినీ మెప్పించే కథ కథనాలతో ఈ సినిమా వస్తుందని. సినిమ రిజక్ట్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని నిర్మాత దిల్ రాజు అంతకుముందు చెప్పారు.

RRR తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న చరణ్ చేస్తున్న ఈ గేమ్ చేంజర్ మీద భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. శంకర్ సినిమాల్లో సాంగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. తన సినిమాలకు ఎప్పుడు రెహమాన్ ని ప్రిఫర్ చేసే శంకర్ ఈసారి థమన్ తో ప్రయోగం చేస్తున్నాడు. అయితే శంకర్ తో ఛాన్స్ అదృష్టంగా భావిస్తున్న థమన్ గేమ్ చేంజర్ కోసం నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటిదాకా ఈ సమ్మర్ లో సినిమా వస్తుందని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు కానీ లేదా అక్టోబర్ 15 దసరా ఫెస్టివల్ కి గానీ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దసరా సీజన్ కు బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. సినిమా లేట్ అయినా లేటెస్ట్ గా వస్తుందని. మెగా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు మేకర్స్.

చరణ్ సినిమా కోసం మొన్నటిదాకా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఎదురుచూసే వారు. కానీ ట్రిపుల్ ఆర్ లో రామరాజు పాత్రలో తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టిన చరణ్ కి హిందీ ఆడియన్స్ కూడా అభిమానులుగా మారిపోయారు. అందుకే శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మీద భారీ క్రేజ్ ఏర్పరచుకున్నారు. మరి గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ అంచనాలు ఏమేరకు వర్క్ అవుట్ అవుతాయన్నది చూడాలి.