Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ఫ్యాష‌న్ గేమ్ ఛేంజ‌ర్ అత‌డు?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యాష‌న్ గేమ్ ని ఛేంజ్ చేసేందుకు ఒక‌ షాడో బ‌రిలో దిగాడ‌ట‌

By:  Tupaki Desk   |   21 Dec 2023 1:30 AM GMT
చ‌ర‌ణ్ ఫ్యాష‌న్ గేమ్ ఛేంజ‌ర్ అత‌డు?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యాష‌న్ గేమ్ ని ఛేంజ్ చేసేందుకు ఒక‌ షాడో బ‌రిలో దిగాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా షాడో అంటే.. పాపుల‌ర్ బాలీవుడ్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా గేమ్ ఛేంజ్ చేస్తున్నాడ‌ని తెలిసింది. ఇంత‌కీ ఏ సినిమా కోసం ఈ మార్పులు? అంటే.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సెట్స్ పై ఉన్న గేమ్ ఛేంజ‌ర్ కోసం మ‌నీష్ ని బ‌రిలో దించార‌ని తెలిసింది.


ఇప్ప‌టికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌యింది. పెండింగ్ లో ఉన్న కొన్ని భారీ త‌నం నిండిన పాట‌ల కోసం చ‌ర‌ణ్ లుక్ ని మార్చేందుకు మ‌నీష్ ప్ర‌యత్నిస్తున్నార‌ట‌. శంక‌ర్ సినిమాలో పాట‌లు అంటే అతి భారీ సెట్లు, భారీ కాస్ట్యూమ్స్ , అరుదైన లొకేష‌న్ల‌తో కూడుకుని ఉంటాయి. దానికి త‌గ్గ‌ట్టు స్టార్ల‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మ‌నీష్ మ‌ల్హోత్రా చివ‌రి నిమిషంలో ఇలాంటి ఛాలెంజ్ ని స్వీక‌రించార‌ని అభిమానులు భావిస్తున్నారు.

రానున్న‌ రోజుల్లో కొన్ని పాటలను చిత్రీక‌రించాల్సి ఉంది. దాని కోసం శంక‌ర్ అండ్ టీమ్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే మనీష్ కొన్ని ప్రకటనలు, పెళ్లిళ్ల కోసం రామ్ చరణ్‌ను స్టైల్ చేశాడు కానీ సినిమా కోసం ఎప్పుడూ స్టైలింగ్ చేయ‌లేదు. కానీ ఇప్పుడు చ‌ర‌ణ్ తో సినిమా కోసం ప‌ని చేస్తున్నాడు. కీల‌క‌మైన పాటలకు ఏస్ డిజైనర్ మ‌నీష్ తనని స్టైల్ చేయాలని చ‌ర‌ణ్‌ కోరుకోవడంతో గేమ్ ఛేంజర్‌కి ఈ అవ‌కాశం క‌లిగింది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు దాదాపు 200కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని ప్ర‌చార‌మవుతోంది.