Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఈ అప్డేట్ తో ఏం చేస్తారో?

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక రెండు మూడు పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. ఫస్ట్ సాంగ్ అయితే ఎప్పటినుంచో విడుదల చేయాలని అనుకుంటున్నాప్పటికీ వీలు పడడం లేదు.

By:  Tupaki Desk   |   5 March 2024 3:39 PM GMT
గేమ్ ఛేంజర్.. ఈ అప్డేట్ తో ఏం చేస్తారో?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఓ వర్గం మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలైతే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో వాయిదా పడుతూ వస్తోంది.

అసలు రిలీజ్ డేట్ విషయంలో అయితే ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ ఎంతవరకు కొనసాగింది, సాంగ్స్ అప్డేట్స్ ఇస్తారా లేదా అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ అస్సలు చప్పుడు చేయడం లేదు. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక రెండు మూడు పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. ఫస్ట్ సాంగ్ అయితే ఎప్పటినుంచో విడుదల చేయాలని అనుకుంటున్నాప్పటికీ వీలు పడడం లేదు.

ఇక మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేయాలి అని అనుకుంటున్నారు గత ఏడాది విడుదల చేయాలని అనుకున్న జరగండి జరగండి అనే పాట ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయింది. తమన్ స్వరపరిచిన ఆ పాటపై చాలా రకాల ట్రోల్స్ అయితే వచ్చాయి.

సాంగ్ అంతగా ఇంపాక్ట్ లేదు అని విడుదల చేస్తే సినిమాపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది అని కూడా ఓ వర్గం గారు కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన అదే సాంగ్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు ఇప్పటికే శంకర్ తో మాట్లాడి పక్కగా ఆరోజు అప్డేట్ ఇవ్వాల్సిందే అని చెప్పారట.

లేదంటే ఫ్యాన్స్ మరింత గోల పెడతారని కూడా చర్చించినట్లు సమాచారం. ఇక శంకర్ సార్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సాంగ్ కుదరకపోతే మరొక టీజర్ లాంటిది ఏదైనా విడుదల చేయవచ్చట. ఫైనల్ గా ఫ్యాన్స్ కు చరణ్ పుట్టినరోజు ఎలాంటి అప్డేట్ వదులుతారో చూడాలి. ఇక అదే రోజు బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రానుంది.