Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. ఓ కన్ఫ్యూజన్ తీరినట్లే

శంకర్ కెరియర్ లో మొదటి సారిగా ఒక తెలుగు హీరోగా స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తూ ఉండటం ఇదే మొదటిసారి.

By:  Tupaki Desk   |   3 Dec 2023 9:58 AM GMT
గేమ్ చేంజర్.. ఓ కన్ఫ్యూజన్ తీరినట్లే
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ సిద్ధం అవుతోంది. రామ్ చరణ్ ఇమేజ్ ఈ సినిమా రెట్టింపు అవుతుందని మెగా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. శంకర్ కెరియర్ లో మొదటి సారిగా ఒక తెలుగు హీరోగా స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తూ ఉండటం ఇదే మొదటిసారి.

మెగాస్టార్ శంకర్ తో సినిమా చేయాలని ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు. కాని రామ్ చరణ్ కి శంకర్ తో చేసే ఛాన్స్ లభించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతోందని రైటర్ కార్తీక్ సుబ్బరాజు గతంలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇన్ని రోజులు క్లారిటీ లేకుండా ఉంది.

తాజాగా యానిమల్ మూవీ సక్సెస్ మీట్ లో దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. గత 15 రోజుల నుంచి ఈ మూవీ షూటింగ్ మైసూర్ లో జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే 80 షూటింగ్ పూర్తయ్యిందని అన్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగా, శంకర్ లాంటి దర్శకులు అవుట్ పుట్ విషయంలో ఎక్కడా రాజీపడరు. మేకింగ్ కోసం, పెర్ఫెక్షన్ కోసం వారు ఎక్కువ టైం తీసుకుంటారని అన్నారు.

వారిని మనం కంగారు పెట్టకూడదని అన్నారు. సినిమా షూటింగ్ తర్వాత మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని, అది ఎన్ని రోజులు తీసుకుంటుంది అనేదాన్ని చూసుకొని రిలీజ్ డేట్ డిసైడ్ చేస్తామని అన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం శంకర్ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారు అని తెలిపారు.

కచ్చితంగా మూవీ అంచనాలకి మించి వస్తుందని, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయాలని దిల్ రాజు కోరారు. సినిమా ప్రొడక్ట్ విషయంలో అస్సలు రాజీపడేది లేదని, బెస్ట్ అవుట్ పుట్ ని అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు.