మూడు సినిమాల కంటెంట్ తో గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజయ్యాక అసలు చరణ్ ఈ సినిమా ఎలా చేశాడా అని అందరూ షాకయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలి నిర్మాత దిల్ రాజుకు చాలానే నష్టాన్ని మిగిల్చింది.
By: Tupaki Desk | 24 May 2025 1:11 PM ISTఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ అంతా ఎంతో ఆనందించారు. కానీ ఆ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల లేటవుతూ రావడంతో ఫ్యాన్స్ కు సినిమాపై ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. శంకర్ సినిమా అంటే ఈ తలనొప్పి సహజమనుకున్నారంతా. ఆఖరికి మూడేళ్ల తర్వాత సినిమా రిలీజైంది.
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజయ్యాక అసలు చరణ్ ఈ సినిమా ఎలా చేశాడా అని అందరూ షాకయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలి నిర్మాత దిల్ రాజుకు చాలానే నష్టాన్ని మిగిల్చింది. అయితే ఈ సినిమా కోసం శంకర్, దిల్ రాజుతో చాలానే ఖర్చు పెట్టించాడు. ఒక బడ్జెట్ అనుకుని మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్ చివరకు ఎక్కడికో వెళ్లి ఆగింది.
శంకర్ సినిమాకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువే బడ్జెట్ అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతీ సీన్‌కీ శంకర్ విపరీతంగా ఖర్చు పెట్టించే శంకర్, ఈ సినిమా కోసం కూడా అంతే ఖర్చు పెట్టించాడు. అయితే అన్ని సినిమాల కంటే శంకర్ గేమ్ ఛేంజర్ నిర్మాతతో ఎక్కువ ఖర్చు పెట్టించాడని రీసెంట్ గా బయటికొచ్చిన ఓ విషయం స్పష్టం చేస్తుంది.
ఆ విషయం ఏంటంటే శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను ఏకంగా ఏడున్నర గంటల నిడివితో తీశాడట. ఆ విషయాన్ని ఆ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేసిన షమీర్ మహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు సినిమాకు సంబంధించిన ఫైనల్ రష్ దాదాపు ఏడున్నర గంటలు వచ్చిందని, దాన్ని మూడు గంటలకు ఎడిట్ చేశానని చెప్పాడు.
అయితే తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల షమీర్ గేమ్ ఛేంజర్ నుంచి తప్పుకోగా, ఆ తర్వాత మరో ఎడిటర్ దాన్ని మరింత ట్రిమ్ చేశాడు. షమీర్ చెప్పిన దాన్ని బట్టి శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను మూడు సినిమాలకు సరిపోయో ఫుటేజ్ ను తీశాడంటే ఎడిటింగ్ లో ఎంత ఫుటేజ్ పోయిందో అర్థమవుతుంది. గేమ్ ఛేంజర్ రిలీజయ్యాక అందులో పని చేసిన చాలా మంది సినిమాలో మా సీన్స్ అన్నీ ఎడిటింగ్ లో కట్ చేశారని కూడా చెప్పారు. ఎడిటింగ్ లో నాలుగున్నర గంటల సినిమాను తీసేశారంటే ఈ సినిమాకు దిల్ రాజు తో శంకర్ ఎంత బడ్జెట్ పెట్టి వేస్ట్ చేయించాడో అర్థం చేసుకోవచ్చు.
