Begin typing your search above and press return to search.

శంక‌ర్‌పై ఎడిట‌ర్ షాకింగ్ కామెంట్స్‌

నిర్మాత‌గా దిల్ రాజుకు భారీ న‌ష్టాల‌ని అందించి కోలుకోలేని దెబ్బ‌కొట్టిన ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 May 2025 10:15 AM
Editor Shameer Shocking Revelations on Shankar Game Changer
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ తెర‌కెక్కించిన భారీ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా `గేమ్ ఛేంజ‌ర్‌`. దిల్ రాజు నిర్మాణంలో భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ మూవీ స‌గ‌టు ప్రేక్ష‌కుడి అంచ‌నాల్ని అందుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైంది. రామ్ చ‌ర‌ణ్, దిల్ రాజు మూడేళ్లు శ్రమించిన ఫ‌లితం శంక‌ర్ వ‌ల్ల బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మారి ఈ ఇద్ద‌రికి భారీ షాక్ ఇచ్చింది.

నిర్మాత‌గా దిల్ రాజుకు భారీ న‌ష్టాల‌ని అందించి కోలుకోలేని దెబ్బ‌కొట్టిన ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకు ప‌ని చేసిన ఎడిట‌ర్ తాజాగా శంక‌ర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాకు ష‌మీర్ ముహ‌మ్మ‌ద్ ఎడిట‌ర్‌గా మూడేళ్లు వ‌ర్క్ చేశాడు. ఈ సినిమా స‌మ‌యంలో త‌ను మ‌రో ప్రాజెక్ట్ అంగీక‌రించ‌లేదు. అలా డెడికేటెడ్‌గా వ‌ర్క్ చేసిన ష‌మీర్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

శంక‌ర్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ష‌మీర్ `గేమ్ ఛేంజ‌ర్‌` నిడివిపై షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌పెట్టారు. ఈ సినిమా నిడివి ఏడున్న‌ర గంట‌ల‌న్నారు. గేమ్ ఛేంజ‌ర్‌ కు ఎడిట‌ర్‌గా నేను కొంత కాలం ప‌ని చేశా. నేను వ‌ర్క్ చేసిన‌ప్పుడు ఈ సినిమా నిడివి ఏడున్న‌ర గంట‌లు. దాన్ని నేను మూడు గంట‌ల‌కు ట్రిమ్ చేశా. మూడేళ్ల త‌రువాత నాకు వేరే క‌మిట్‌మెంట్స్ వుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. దుర‌దృష్ట వ‌శాత్తు ఈ ప్రాజెక్ట్ నాకు స‌రైన సంతృప్తిని అందించ‌లేదు` అని తెలిపారు.

ఎడిట‌ర్ ష‌మీర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దీంతో శంక‌ర్‌పై స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది. ఒక సినిమాని ఏడున్న‌ర గంట‌లు తీయ‌డం అంటే మామూలు విష‌యం కాద‌ని, అలా చేస్తే బ‌డ్జెట్ రెట్టింపు అవుతుంద‌ని, ఆయ‌న కార‌ణంగానే `గేమ్ ఛేంజ‌ర్‌` బ‌డ్జెట్ అనుకున్న దానికి మించి పెరిగి దిల్ రాజుకు భ‌రించ‌లేని భారంగా మారింద‌ని వాపోతున్నారు. మొద‌టి నుంచి శంక‌ర్ భారీగా ఖ‌ర్చు పెట్టిస్తాడ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నా `గేమ్ ఛేంజ‌ర్` నిడివి బ‌య‌టికి రావ‌డంతో ఆయ‌న పెట్టించే ఖ‌ర్చు మొత్తం దుబారా అని తేలిపోయింది.

శంక‌ర్ చేసిన త‌ప్పుల కార‌ణంగానే లైకా ప్రొడ‌క్ష‌న్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంద‌ని, శంక‌ర్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు చేసిన `2.ఓ`, ఇండియ‌న్ 2`, ఇండియ‌న్ 3` వారికి భారంగా మారాయ‌ని, ఈ న‌ష్టాల నుంచి వారు కోలుకోవ‌డం ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌ని కాద‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వాపోతున్నారు. ఓ ప్ర‌ణాళిక లేకుండా అవ‌స‌రం లేని హంగుల‌కు వెళ్లి ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ప్పుల మీద త‌ప్పులు చేశార‌ని, ఇప్ప‌టికైనా వాటి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుని స‌రికొత్త‌గా తిరిగి రావాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు.