చిన్న పీస్ కట్ చేసి.. చీల్చి చెండాడుతున్నారు.. గేమ్ ఛేంజర్ రచ్చపై దిల్ రాజు..!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ సినిమా తమ్ముడు. నితిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 1 July 2025 4:28 PMప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ సినిమా తమ్ముడు. నితిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. జూలై 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. మంచి కాన్సెప్ట్ మూవీ కాబట్టి సినిమా నటీనటులతో పాటు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఐతే ఈ ఇంటర్వ్యూస్ లో అటు దిల్ రాజుని, శిరీష్ కు గేం ఛేంజర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రతి ఇంటర్వ్యూలో రాం చరణ్ గేమ్ ఛేంజర్ పై ప్రశ్నల గురించి అడగడంపై నిర్మాత దిల్ రాజు దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి ఫ్లాప్ అయ్యాయి. ఇది తమ్ముడు సినిమా ప్రమోషన్ ఈ సినిమా గురించి మాట్లాడండి. గేమ్ ఛేంజర్ చుట్టూనే ఎందుకు ప్రశ్నలంటూ చెప్పుకొచ్చారు. చరణ్ తో తనకు హెల్దీ రిలేషన్ ఉందని.. నిన్న కూడా సినిమా అనౌన్స్ చేశా.. ఈ ఇయర్ హిట్ ఇవ్వలేకపోయా.. మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని చరణ్ తో సూపర్ హిట్ సినిమా తీయాలని చెప్పాను.
22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. అందరి స్టార్స్ తో గుడ్ రిలేషన్ మెయిన్ టైన్ చేస్తున్నామని.. అందరు స్టార్స్ తో సినిమాలు తీసిన సంస్థ మాది అని అన్నారు దిల్ రాజు. ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అతన్ని లోపలికి లాగేసి.. ఒకళ్లు క్వశ్చన్ చేసి.. అక్కడ ట్రోల్స్ చేసేలా చేశారు. అది అసలు అవసరం లేని టాపిక్ అన్నారు దిల్ రాజు.
గేమ్ ఛేంజర్ గురించి కాదు ఆడిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం గురించి మాట్లాడొచ్చు కదా గేమ్ ఛేంజర్ ఎందుకు అని అన్నారు. చాలా ఇండస్ట్రీలో ఫ్లాపైన సినిమాలు ఉన్నాయి ఏ సినిమాను ఇంతగా పట్టుకోలేదు. గేమ్ ఛేంజర్.. దిల్ రాజు ఇవే అడుగుతున్నారని అన్నారు. సినిమా రిలీజై ఆరు నెలలు అవుతున్నా అదే ప్రశ్నలడిగి మమ్మల్ని చీల్చి చెండాడి.. దాన్ని బయటకు తీసుకెళ్తారు.. పోని జరిగే సంభాషణ మొత్తం వేస్తారా అంటే దానిలో కావాల్సిన చిన్న పీస్ కట్ చేసి దన్ని హైలెట్ చేస్తారు. ఒక సినిమాపై ఇంత నెగిటివిటీ ఎందుకు.. అది అయిపోయిన సినిమా అది జరిగి ఆరు నెలలు అయ్యింది. ఆ తర్వాత ఎన్నో ఫ్లాపులొచ్చాయి ఆ ఒక్క ఫ్లాప్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు.