Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఆ రెండు పండగలే టార్గెట్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 1:30 PM GMT
గేమ్ ఛేంజర్.. ఆ రెండు పండగలే టార్గెట్?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడో ఫినిష్ కావాల్సిన ఈ సినిమా ఇంకా సరైన రిలీజ్ అప్డేట్ కూడా ఇవ్వకపోవడం ఫాన్స్ లో అయితే కొంత అసహనానికి గురిచేస్తుంది. అసలే నిర్మాత దిల్ రాజు పక్కా ప్రణాళికతో సినిమాలను పూర్తి చేస్తూ ఉంటాడు ఇక ఆయన ఈ సినిమా విషయంలో మాత్రం ఊహించని విధంగా పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దర్శకుడు శంకర్ మరోవైపు ఇండియన్ 2 ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్ల గేమ్ చేంజర్ పనులు చాలా వరకు ఆగిపోయాయి. ఇక దిల్ రాజు ఎప్పుడు కనిపించినా కూడా ఆ సినిమా రిలీజ్ విషయంలో అయితే శంకర్ గారిదే తుది నిర్ణయం అన్నట్లుగా వివరణ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ విషయంలో అయితే ఒక రెండు డేట్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఎలాగు శంకర్ ఇండియన్ 2 సినిమాను అయితే పూర్తి చేసుకుంటున్నాడు. రేపో మాపో అన్ని పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. అయితే గేమ్ చేంజర్ ప్రాజెక్టు మాత్రం వీలైనంత తొందరగా పూర్తి చేసి 2024 దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ పండగ సీజన్ దొరక్కపోతే 2025 సంక్రాంతికి ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలి అని దిల్ రాజు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ముందుగా దసరా లేదంటే ఆ తర్వాత వచ్చే సంక్రాంతి రెండిట్లో ఏదైనా బెస్ట్ అనే అనుకుంటున్నారట కానీ శంకర్ సినిమాలో ఆ ప్లాన్ కు తగ్గట్టుగా పూర్తి చేస్తారా లేదా అనేది మరొక పెద్ద సందేహం. అలాగే ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో కూడా విడుదల చేయాలి కాబట్టి ప్రమోషన్స్ కోసం కనీసం ఒక నెల రోజులైనా తిరగాల్సి ఉంటుంది.

కాబట్టి ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి శంకర్ అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతారో లేదో చూడాలి ఇక మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా 2025 చివరలో వచ్చే అవకాశం ఉంది.