Begin typing your search above and press return to search.

గామా విన్నర్స్ పూర్తి లిస్ట్.. కుర్ర హీరోల హవా..

చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే తెలుగు మూవీ గామా అవార్డ్స్‌ నాలుగో ఎడిషన్ వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగింది

By:  Tupaki Desk   |   7 March 2024 11:30 AM GMT
గామా విన్నర్స్ పూర్తి లిస్ట్.. కుర్ర హీరోల హవా..
X

చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే తెలుగు మూవీ గామా అవార్డ్స్‌ నాలుగో ఎడిషన్ వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు చిత్రసీమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

గత మూడేళ్లలో విడుదలైన సినిమాల నుంచి బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ సినిమా డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తదితర 42 కేటగిరీలకు అవార్డ్స్ అందజేశారు గామా అవార్డ్స్ నిర్వాహకులు. అందమైన భామలు డింపుల్ హయతి, సంయుక్తా మీన‌న్, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్, నేహా శెట్టి, ఫరియా అబ్దుల్లా తమ డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. మరి వివిధ కేటగిరీల్లో అవార్డులు అందుకున్న వారి పూర్తి వివరాలు ఇవే.

పుష్ప తగ్గేదేలే

2021లో విడుదలైన పుష్ప మూవీ అవార్డుల విషయంలో అదరగొట్టేసింది. పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు వరించింది. అదే సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ఇక మూవీ ఆఫ్ ది ఇయర్ గా కూడా పుష్పనే నిలిచింది. అందుకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యలమంచిలి రవి, నవీన్ యెర్నేని అవార్డును అందుకున్నారు.

బెస్ట్ యాక్ట్రెస్ - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు మూవీ)

బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి)

మోస్ట్ పాపులర్ సాంగ్- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)

బెస్ట్ సింగర్ మేల్- ధనుంజయ్ (నా మది నీదే)

బెస్ట్ సింగర్ ఫిమేల్ - ఎంఎల్ శృతి (అడిగా అడిగా)

బెస్ట్ పాపులర్ సాంగ్ (గామా) - మౌనిక యాదవ్ (పుష్ప- సామి నా సామి సాంగ్)

2022లో రిలీజైన సినిమాలకు గాను బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ సిద్ధార్థ్(కార్తీకేయ-2), ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ (సీతారామం), బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా డింపుల్ హయతి (ఖిలాడి), మూవీ ఆఫ్ ది ఇయర్ గా సీతారామం (వైజయంతి మూవీస్), బెస్ట్ డైరెక్టర్ గా హను రాఘవపూడి (సీతా రామం), గామా జ్యూరీ ఉత్తమ నటుడిగా విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ (భీమ్లా నాయక్), బెస్ట్ సింగర్స్ గా అనురాగ్ కులకర్ణి, హారికా నారాయణ అవార్డులు అందుకున్నారు.

2023 గామా అవార్డుల విజేతలు వీరే!

బెస్ట్ యాక్టర్- బేబీ మూవీకిగాను ఆనంద్ దేవరకొండ

బెస్ట్ యాక్ట్రెస్- విరూపాక్ష చిత్రానికి గాను సంయుక్త మీనన్

బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ చిత్రాలు)

మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ - టీజీ విశ్వప్రసాద్)

బెస్ట్ డైరెక్టర్ - బాబీ (చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ)

జ్యూరీ ఉత్తమ నటుడు(గామా) - సందీప్ కిషన్ (మైఖేల్)

బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ గా తేజ

వీటితో మరికొన్ని అవార్డులను కూడా అందించారు. బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ గా హనుమాన్ సినిమాకు గాను యంగ్ హీరో తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు. నాని దసరా సినిమాలోని చంకీలా అంగీ లేసి సాంగ్ కు గాను బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్య శ్యామన్ అవార్డు కైవసం చేసుకున్నారు. ధూమ్ ధాం పాటకు గాను బెస్ట్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్, ఆరాధ్య సాంగ్ కు చిన్మయి అవార్డులు అందుకున్నారు.

లెజెండ్రీ సంగీత దర్శకుడు (గామా ) - కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

స్పెషల్ జ్యూరీ అవార్డు (గామా)- ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

గౌరవ్ సత్కర్ (గామా)- చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (గామా) - హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి)

మూవీ ఆఫ్ ది డెకేడ్ (గామా) - ఆర్ ఆర్ ఆర్ (డీవీవీ దానయ్య ప్రొడ్యూసింగ్)

మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ (గామా) - నక్కిలీసు గొలుసు (పలాస మూవీ- రఘు కుంచె)