Begin typing your search above and press return to search.

మహేష్ మేనల్లుడు.. వాళ్ళ దృష్టిలో పడ్డాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అనే ఇమేజ్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటుడు గల్లా అశోక్.

By:  Tupaki Desk   |   5 April 2024 4:27 AM GMT
మహేష్ మేనల్లుడు.. వాళ్ళ దృష్టిలో పడ్డాడు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అనే ఇమేజ్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటుడు గల్లా అశోక్. హీరో అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన గల్లా అశోక్ కి మొదటి చిత్రం పెద్దగా కలిసిరాలేదు. ఏదో మోస్తరుగా పర్వాలేదనిపించుకుంది. దీంతో రెండో మూవీకి చాలా గ్యాప్ తీసుకొని ప్రశాంత్ వర్మ అందించిన కథతో దేవకీ నందన వాసుదేవ అనే మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ బట్టి చూస్తుంటే మహేష్ బాబు మురారీ తరహాలో కథని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు అర్ధమవుతోంది. ఈ మూవీపై గల్లా అశోక్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ మేనల్లుడి మూడో సినిమా ఖరారైంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి జోరుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ లో గల్లా అశోక్ మూడో సినిమా ఒకే అయ్యింది. దర్శకుడు ఎవరు, క్యాస్ట్ అండ్ క్రూ గురించి పూర్తి వివరాలు త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది. గల్లా అశోక్ చూడటానికి అందంగా ఉంటాడు. డాన్స్ లలో టాలెంట్ చూపిస్తున్నాడు. అలాగే ఫైట్ సీక్వెన్స్ లలో కూడా ఆకట్టుకుంటున్నాడు.

పెర్ఫార్మెన్స్ పరంగా కూడా దేవకీ నందన వాసుదేవ సినిమాతో బాగా ఇంప్రూవ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో రాబోతోంది కాబట్టి ఏ మాత్రం బాగున్న సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లో గల్లా అశోక్ ఎలాంటి కథతో సినిమా చేయబోతున్నాడు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మేనల్లుడు కెరియర్ నిలబెట్టడానికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో సుధీర్ బాబు తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడంట. అతను అచ్చం మహేష్ బాబు లుక్స్ తో ఉండటం విశేషం. రెండేళ్లలో సుధీర్ బాబు కొడుకుని హీరోగా వెండితెరపై చూసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

ఇక మరోవైపు ఘట్టమనేని ఫ్యాన్స్ మహేష్ వారసుడి పై కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. గౌతమ్ ఘట్టమనేనికి ప్రస్తుతం 17 ఏళ్ళ వయసు. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న జూనియర్ సూపర్ స్టార్ తప్పకుండా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని గతంలోనే మహేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇక అతను గ్రాడ్యుయేషన్ అనంతరం టాలీవుడ్ లోకి అడుగు పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.