Begin typing your search above and press return to search.

గజాల.. క్రేజ్ అస్సలు తగ్గలేదు

సినిమాలో కామెడీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం చేసిన గజాల పాత్ర గురించి సోషల్ మీడియాలో రోజుకు ఒక మీమ్ వస్తూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 6:08 AM GMT
గజాల.. క్రేజ్ అస్సలు తగ్గలేదు
X

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బెస్ట్ సినిమాలలో వెంకీ ఒకటి. ఈ సినిమా కంటెంట్ మొత్తం ఎంతగా వైరల్ అయిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో కామెడీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం చేసిన గజాల పాత్ర గురించి సోషల్ మీడియాలో రోజుకు ఒక మీమ్ వస్తూనే ఉంటుంది.

అసలు గజాల పాత్ర లేకపోయి ఉంటే మీమర్స్ పరిస్థితి ఎలా ఉండేదో అనే కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంతగా వైరల్ అయిన ఆ పాత్రను మరోసారి వెండితెరపై చూడడానికి నేటితరం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని చూపించారు. వెంకీ సినిమా రీ రిలీజ్ చేయాలి అంటూ గత ఏడాది నుంచి సోషల్ మీడియాలో డిమాండ్ కట్టిగానే వచ్చింది.

ఇక ఈ ఏడాది మధ్యలోనే వెంకీ సినిమాను మళ్ళీ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకో వెనకడుగు వేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఏడాది చివరలో వేస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చారు. ఇక గత నెల నుంచి సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని ఓవర్గం గజాల ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇక మొత్తానికి సినిమా లో కొన్ని లిమిటెడ్ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఇక అందులో గజాల పాత్ర ఇంటర్వ్యూ ఇవ్వగానే ఆడియన్స్ విజిల్స్ వేసిన విధానం మామూలుగా లేదు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు గజాల ఎంట్రీ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉందా అని అందరూ మరోసారి ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు శ్రీనువైట్ల కూడా క్రేజ్ ఇలా ఉంటుంది అని ఊహించి ఉండరు. ఇక ఇందులో రవితేజ వెంకీ క్యారెక్టర్ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిన కూడా మీమర్స్ వెంకీ సినిమాకు సంబంధించిన మీమ్స్ తోనే మంచి స్టఫ్ అయితే అందిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు రిలీజ్ హడావిడి అయితే గట్టిగానే మొదలైంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి వెంకీ మొత్తంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.