'గద్దర్ అవార్డ్స్' ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా కల్కి..బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ (పుష్ప 2)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
By: Tupaki Desk | 29 May 2025 11:10 AM ISTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను' ప్రకటించింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చలన చిత్ర అవార్డులను అందించడం సినీ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పురస్కారాలు కేవలం నటీనటులకే కాకుండా, సాంకేతిక నిపుణులు, వివిధ నేపథ్యాల్లో తెరకెక్కిన చిత్రాలకు కూడా గుర్తింపునిస్తున్నాయి.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా సీనియర్ నటి జయసుధ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ప్రకటించారు. ఈ 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి సినీ పురస్కారాలు ఇస్తున్న విషయాన్ని దిల్ రాజు ప్రత్యేకంగా గుర్తు చేశారు.
గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి ఇతర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. జ్యూరీ సభ్యులు ఈ నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేశారు. 2024 సంవత్సరానికి 'ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది. ఈ విభాగంలో 'పొట్టేల్', 'లక్కీభాస్కర్' సినిమాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కేవలం ఉత్తమ చిత్రాలకే కాకుండా, చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు (టెక్నికల్ టీమ్), జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, బాలల చలన చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన సినిమాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందజేస్తారు.
అంతేకాకుండా, యానిమేషన్ సినిమాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు (డెబ్యూ ఫీచర్ ఫిల్మ్), డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు (సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్), లఘు చిత్రాల (షార్ట్ ఫిల్మ్) విభాగాల్లోనూ గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన వారికి, పుస్తకాలు ప్రచురించిన వారికి, అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా గద్దర్ పురస్కారాలు దక్కనున్నాయి.
గద్దర్ అవార్డ్స్ పూర్తి జాబితా
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ ఇవే..
* కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
* పొట్టేల్ (రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
* లక్కీ భాస్కర్ (మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
* బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ - (35 ఇది చిన్న కాదు)
* బెస్ట్ డెబిట్ ఫిల్మ్ డైరెక్టర్ - వంశీ(కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ హోల్ సేల్ ఎంటర్ టైనర్ మెంట్(ఆయ్)
* బెస్ట్ డైరెక్టర్- నాగ్ అశ్విన్
* బెస్ట్ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లురీ ( లక్కీ భాస్కర్)
* బెస్ట్ కమెడియన్ - సత్య, వెన్నెల కిషోర్
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - ఎస్. జె సూర్య
* బెస్ట్ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య
* బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ (పుష్ప 2)
* బెస్ట్ యాక్టరెస్ - నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టరస్: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
* బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : బీమ్స్ (రజాకార్)
* బెస్ట్ మేల్ సింగర్ : సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
* బెస్ట్ ఫీమేల్ సింగర్ : శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
* బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్స్ - మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
* బెస్ట్ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
* బెస్ట్ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
* బెస్ట్ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)
* బెస్ట్ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్‌రెడ్డి (గామి)
* బెస్ట్ ఎడిటర్ - నవీన్ నూలి(లక్కీ భాస్కర్)
