2014-2023.. గద్దర్ అవార్డుల బెస్ట్ మూవీస్ ఇవే!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను 2024 ఏడాదిగాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన సినిమాలకు గద్దర్ అవార్డులు అనౌన్స్ చేసింది.
By: Tupaki Desk | 30 May 2025 1:17 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను 2024 ఏడాదిగాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన సినిమాలకు గద్దర్ అవార్డులు అనౌన్స్ చేసింది. ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలను వెల్లడించింది. ఈ మేరకు సినీ నటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్రాల పేర్లను రివీల్ చేశారు.
ఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను కౌంట్ లోకి తీసుకున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. వాటితో పాటు ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్రత్యేక అవార్డుల వివరాలు!
ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు
నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు
దర్శకుడు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు
దర్శకుడు సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు
నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు
నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు
రచయిత యండమూరికి రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు
2014-2023 సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలు ఇవే!
2014
తొలి ఉత్తమ సినిమాగా రన్ రాజా రన్
రెండో ఉత్తమ సినిమాగా పాఠశాల
మూడో ఉత్తమ సినిమాగా అల్లుడు శీను
2015
ఫస్ట్ బెస్ట్ మూవీగా రుద్రమదేవి
సెకెండ్ బెస్ట్ మూవీగా కంచె
థర్డ్ బెస్ట్ మూవీగా శ్రీమంతుడు
2016
ప్రథమ ఉత్తమ చిత్రంగా శతమానం భవతి
ద్వితీయ ఉత్తమ చిత్రంగా పెళ్ళి చూపులు
తృతీయ ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్
2017
తొలి ఉత్తమ సినిమాగా బాహుబలి 2
రెండో ఉత్తమ సినిమాగా ఫిదా
మూడో ఉత్తమ సినిమాగా ఘాజీ
2018
ఫస్ట్ బెస్ట్ మూవీగా మహానటి
సెకెండ్ బెస్ట్ మూవీగా రంగస్థలం
థర్డ్ బెస్ట్ మూవీగా కేరాఫ్ కంచరపాలెం
2019
ప్రథమ ఉత్తమ చిత్రంగా మహర్షి
ద్వితీయ ఉత్తమ చిత్రంగా జెర్సీ
తృతీయ ఉత్తమ చిత్రంగా మల్లేశం
2020
తొలి ఉత్తమ సినిమాగా అల వైకుంఠపురములో
రెండో ఉత్తమ సినిమాగా కలర్ ఫొటో
మూడో ఉత్తమ సినిమాగా మిడిల్ క్లాస్ మెలొడీస్
2021
ప్రథమ ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్
రెండో ఉత్తమ చిత్రంగా అఖండ
మూడో ఉత్తమ చిత్రంగా ఉప్పెన
2022
ఫస్ట్ బెస్ట్ మూవీగా సీతారామం
సెకెండ్ బెస్ట్ మూవీగా కార్తికేయ
థర్డ్ బెస్ట్ మూవీగా మేజర్
2023
ప్రథమ ఉత్తమ సినిమాగా బలగం
రెండో ఉత్తమ సినిమాగా హనుమాన్
మూడో ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి
ఇప్పటికే ప్రకటించిన సినిమాలకు, సెలబ్రిటీలకు తెలంగాణ ప్రభుత్వం.. వచ్చే నెల 14న అవార్డులు అందించనుంది! అందుకు గాను భారీ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.
