Begin typing your search above and press return to search.

గదర్ 2కి సూపర్ బజ్..!

అయితే ఆడియన్స్ కు సినిమా బడ్జెట్ కన్నా వారు ఎంచుకున్న సబ్జెక్ట్ ముఖ్యం అందుకే గదర్ 2 సినిమాపై ఈ క్రేజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 12:44 PM GMT
గదర్ 2కి సూపర్ బజ్..!
X

మొన్నటిదాకా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా సరైన ఓపెనింగ్స్ పడట్లేదు.. అసలు అక్కడ సినిమాలకు బజ్ రావట్లేదని కంగారు పడిన బాలీవుడ్ మేకర్స్ రీసెంట్ సినిమాలతో కాస్త కుదుట పడినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలో లేటెస్ట్ గా రాబోతున్న గదర్ 2 సినిమాకు బాలీవుడ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

సన్నీ డియోల్ నటించిన ఈ సినిమా గురించి బీ టౌన్ ఆడియన్స్ మంచి అంచనాలతో ఉన్నారు. సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన గదర్ 2 సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుండగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. స్టార్ సినిమా రేంజ్ బజ్ గదర్ 2 కి క్రియేట్ అయ్యింది. దాని వల్ల సినిమాకు బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.

గదర్ 2 సినిమా 100 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఆడియన్స్ కు సినిమా బడ్జెట్ కన్నా వారు ఎంచుకున్న సబ్జెక్ట్ ముఖ్యం అందుకే గదర్ 2 సినిమాపై ఈ క్రేజ్ ఏర్పడింది. అనీల్ శర్మ ఈ సినిమా బడ్జెట్ గురించి వచ్చిన వార్తలు తోసిపుచ్చినా సినిమా 100 కోట్ల బడ్జెట్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారత సైన్యం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించిన మద్దతు చాలా గొప్పదని అన్నారు. వారు అలా సపోర్ట్ అందించడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందని ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన ఈ బజ్ కి కారణం కూడా అదే అని అన్నారు డైరెక్టర్ అనీల్ శర్మ.

ఈ సినిమా కోసం సన్నీ డియోల్ కూడా రెమ్యునరేషన్ చాలా రాజీ పడ్డారు.. ఈమధ్య హీరోలంతా కూడా సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా 100, 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. కానీ సన్నీ డియోల్ మాత్రం ఈ సినిమాకు ఆయన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని అన్నారు. గదర్ 2 కి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయని.. ఈ ట్రెండ్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందిస్తాయని అన్నారు.

2001 లో బ్లాక్ బస్టర్ అందుకున్న గదర్ కి సీక్వల్ గా వస్తున్న గదర్ 2 సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. గదర్ సినిమా అప్పట్లోనే లగాన్ ని మించి ఆడింది. గదర్ 2 సినిమా తో సన్నీ డియోల్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.