Begin typing your search above and press return to search.

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ క్యాన్సిల్.. ఎందుకంటే?

అయితే ఫ్యాన్స్ నుంచి ఆదరణ ఉండటంతో డిజాస్టర్ సినిమాలని కూడా రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:44 AM GMT
గబ్బర్ సింగ్ రీ రిలీజ్ క్యాన్సిల్.. ఎందుకంటే?
X

ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా స్టార్ హీరోలకి సంబంధించిన పాత సినిమాలు అన్ని కూడా 4కె క్వాలిటీతో మరల థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ షోలుగా ఒకటి, రెండు రోజులు ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు సోషల్ సర్వీస్ కోసం ఈ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. వాటితో వచ్చే డబ్బుని ఏదో ఒక సామాజిక సేవ కోసం ఉపయోగిస్తున్నారు.

అయితే ఫ్యాన్స్ నుంచి ఆదరణ ఉండటంతో డిజాస్టర్ సినిమాలని కూడా రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆరెంజ్ తో ఫస్ట్ డిజాస్టర్ మూవీ రీరిలీజ్ చేశారు. దానికి సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ప్రభాస్ యోగి మూవీ రీరిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2న రాబోతోంది. ఆ రోజున గుడుంబా శంకర్ రీరిలీజ్ చేయడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.

నాగబాబు ఈ మూవీ రీరిలీజ్ ప్లానింగ్ చూసుకుంటున్నారు. ఇప్పటికే పోస్టర్స్, 4కె ట్రైలర్ ని కూడా విడిచిపెట్టారు. ప్రమోషన్ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కి గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తానని బండ్ల గణేష్ గతంలో ప్రకటించారు. దీంతో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే ఎలా అనే కన్ఫ్యూజన్ అభిమానులకి వచ్చింది.

దీనిపై తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ చేయడం లేదని చెప్పారు. కరెక్ట్ టైమ్ చూసుకొని అభిమానుల కోసం కచ్చితంగా గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తానని ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ అభిమానులకి టెన్షన్ తగ్గింది. బండ్ల గణేష్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ హార్డ్ కోర్ అభిమానులు అంటున్నారు.

అయితే కొంతమంది మాత్రం గుడుంబా శంకర్ కంటే గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు. గుడుంబా శంకర్ మూవీ డిజాస్టర్ అయిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో ఈ మూవీ కథాంశం ఉంటుంది. కచ్చితంగా పవన్ అభిమానులు మరోసారి ఆ ఫన్ ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నారు.