గబ్బర్ సాంగ్ సాయికి బెదిరింపులు.. ఏం జరిగిందంటే?
పవన్ కు సినిమాలు చేయడం తప్ప వేరే బిజినెస్ లు ఏమీ లేవని చెప్పిన గబ్బర్ సింగ్ సాయి.. హరిహర వీరమల్లు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంంతోషంగా ఉందని తెలిపారు.
By: Tupaki Desk | 27 July 2025 1:27 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ లో విలన్ గ్యాంగ్ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించింది గ్యాంగ్. తమదైన టాలెంట్ తో క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. అప్పడప్పుడు గ్యాంగ్ అంతా సందడి చేస్తోంది.
ఆ గ్యాంగ్ లో ఒకరైన గబ్బర్ సింగ్ సాయి.. రీసెంట్ గా తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని థియేటర్స్ లో చూశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు యాంకర్ శ్యామల, మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు వేశారు. హరిహర వీరమల్లు సినిమా వారికి చెంపదెబ్బ అని అన్నారు.
పవన్ కు సినిమాలు చేయడం తప్ప వేరే బిజినెస్ లు ఏమీ లేవని చెప్పిన గబ్బర్ సింగ్ సాయి.. హరిహర వీరమల్లు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంంతోషంగా ఉందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట.
ఈ మేరకు సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసిన వైసీపీ కార్యకర్తలమంటూ చెబుతున్నారని తెలిపారు. చంపేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. తన రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమాపణలు తెలిపారు గబ్బర్ సింగ్ సాయి.
"నేను తప్పుగా మాట్లాడాను. పవన్ సర్ మాకు ఎప్పుడూ తప్పు చేయమని చెప్పలేదు. తప్పుగా మాట్లాడమని కూడా చెప్పలేదు. ఎవరినీ తిట్టమని కూడా చెప్పలేదు. మాకు పవన్ సినిమాలో ఛాన్స్ రావడం వల్ల ఆయనకు ఏమైనా అంటే ముందే సిద్ధంగా ఉంటాం. ప్రాణం ఇవ్వడానికి మేమంతా రెడీ. ఎలాంటి భయం లేదు" అని తెలిపారు.
అయితే తాను వైసీపీ నాయకుల విషయంలో తప్పుడు పదాలు వాడానని చెప్పారు. అవి ఆవేశంలో వచ్చిన మాటలని అన్నారు. ఆ పార్టీలో కూడా తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే తాను క్షమాపణలు చెబుతున్నట్లు గబ్బర్ సింగ్ సాయి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
