Begin typing your search above and press return to search.

గాంజా శంకర్ అంతా సెట్ అయ్యిందా..?

అయితే ఇప్పుడు అదంతా సాల్వ్ అయ్యిందట. అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేసేలా దర్శక నిర్మాతల మధ్య చర్చలు సఫలమయ్యాయట.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:50 AM GMT
గాంజా శంకర్ అంతా సెట్ అయ్యిందా..?
X

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ సినిమా అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఒక గ్లింప్స్ వదిలి ప్రాజెక్ట్ మీద భారీ హైప్ తెచ్చారు. అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ గాంజా శంకర్ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. గాంజా శంకర్ అటకెక్కినట్టు వచ్చిన న్యూస్ లపై మేకర్స్ కూడా స్పందించకపోవడంతో సినిమా దాదాపు క్యాన్సిల్ అనుకున్నారు.

కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్లబోతుందట. డైరెక్టర్ గా మాస్ పల్స్ తెలిసిన సంపత్ నంది సాయి ధరం తేజ్ తో గాంజా శంకర్ ఎక్కువ బడ్జెట్ తో ప్లాన్ చేసినట్టు టాక్. అంత బడ్జెట్ అయితే కష్టమనుకున్న నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు అదంతా సాల్వ్ అయ్యిందట. అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేసేలా దర్శక నిర్మాతల మధ్య చర్చలు సఫలమయ్యాయట.

మెగా హీరోగా సాయి తేజ్ కి మంచి మార్కెట్ ఉంది. యాక్సిడెంట్ వల్ల కాస్త గ్యాప్ ఇచ్చాడు కానీ తేజ్ సినిమాలు హిట్ పడితే మంచి రెవిన్యూనే తెచ్చాయి. అయితే ఎటొచ్చి డైరెక్టర్ మీద నమ్మకంతో గాంజా శంకర్ కి అన్ని కోట్లు పెట్టడం కష్టమని భావించే సినిమాను సేఫ్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ వచ్చేలా ప్లాన్ చేశారట. నిర్మాతల కండీషన్స్ అన్నిటికీ డైరెక్టర్ ఓకే చెప్పడంతో త్వరలోనే గాంజా శంకర్ మళ్లీ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది.

గాంజా శంకర్ తో సాయి ధరం తేజ్ మరోసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు. సిటీమార్ తర్వాత సంపత్ నంది చేస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మేకింగ్ పరంగా టాలెంట్ ఉన్నా కథల విషయంలో సరైన ఎంపిక లేక సంపత్ నంది వెనకబడి ఉన్నాడు. మరి మెగా మేనల్లుడు సినిమాతో అయినా సంపత్ నంది దర్శకుడిగా తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. సితార లాంటి బ్యానర్ ఇచ్చిన ఈ అవకాశం వాడుకుంటే మాత్రం సంపత్ నంది కెరీర్ మళ్లీ గాడిన పడినట్టే అని చెప్పుకోవచ్చు. తేజ్ కి కూడా మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువే కాబట్టి ఈ మాస్ డైరెక్టర్ మాస్ హీరో కలిసి ఎలాంటి మూవీ అందిస్తారన్నది చూడాలి.