Begin typing your search above and press return to search.

గామి టీమ్ కీలక నిర్ణయం.. వారి డబ్బంతా రిటర్న్!

విద్యాధర కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీ.. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.

By:  Tupaki Desk   |   19 March 2024 1:44 PM GMT
గామి టీమ్ కీలక నిర్ణయం.. వారి డబ్బంతా రిటర్న్!
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. గామి చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. విద్యాధర కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీ.. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అఘోర పాత్రలో విశ్వక్ తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఏ పాత్ర అయినా తాను రెడీ అని నిరూపించుకున్నారు.

రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న గామి మూవీ.. ప్రస్తుతం మేకర్స్ కు లాభాల పంట పండిస్తోంది. అనేక చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్ తో కార్తీక్ శబరీశ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కి మంచి హిట్లు అయ్యాయి. కానీ ఫండ్స్ అందించిన వారికి పెట్టుబడులు తిరిగి ఇవ్వడం ఇంతవరకు ఇండస్ట్రీలో జరగలేదని చెప్పవచ్చు.

తాజాగా గామి మూవీ యూనిట్ అద్భుతమైన అడుగువేయాలని నిర్ణయించుకుంది. క్రౌడ్ ఫండింగ్ లో పాల్గొన్న వారిని గౌరవించాలని నిర్ణయించింది. సినిమాకు అందించిన పెట్టుబడులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. "మేం ఈ మైలురాయిని చేరుకున్నందున మీరు సినిమాపై పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలనుకుంటున్నాం" అని గామి యూనిట్ ఇన్వెస్టర్లకు మెయిల్ చేసింది.

ఫస్ట్ నుంచి డబ్బులు ఇచ్చిన వాళ్ల జాబితాను సిద్ధం చేసింది గామి టీమ్. వారు పెట్టిన పెట్టుబడులతో పాటు లాభాలు కూడా అందించనుంది. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. గామి యూనిట్ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కే సినిమాలకు మంచి ప్రోత్సాహకరంగా ఈ నిర్ణయం ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

అఘోర శంకర్ పాత్రలో ఉన్న విశ్వక్.. తన గతాన్ని మర్చి పోతాడు. మానవ స్పర్శను తట్టుకోలేని వ్యాధితో బాధపడుతుంటాడు. అతడిని అందరూ వెలివేయగా.. తన సమస్యకు పరిష్కారం తెలుసుకుంటాడు. హిమాలయాల్లోని 36 ఏళ్లకు ఓసారి వికసించే మాలి పత్రాల కోసం బయలుదేరుతాడు. అతడితో జాహ్నవి(చాందినీ చౌదరి) కూడా వెళ్తోంది. ఆ సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏం జరిగింది? ఇదే సినిమా.