Begin typing your search above and press return to search.

గామి.. అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా..

టాలీవుడ్ టాలెంటెడ్ యువర్ హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2024 9:21 AM GMT
గామి.. అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా..
X

టాలీవుడ్ టాలెంటెడ్ యువర్ హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటూ వస్తున్నాడు. అతని నుంచి ఒక సినిమా వస్తోంది అంటే తప్పకుండా అందులో ఒక సరికొత్త పాయింట్ హైలెట్ అవుతుంది అని ప్రేక్షకులలో నమ్మకం అయితే కుదిరింది. ఇక రీసెంట్ గా అతని నుంచి వచ్చిన గామి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించిన విశ్వక్ తన పాత్రతో అందరికీ స్టన్ అయ్యేలా చేశాడు అని చెప్పవచ్చు. నేటితరం హీరోలు చాలా వరకు ప్రేమకథలు యాక్షన్ సినిమాలు అంటూ ఒక ట్రెండ్ లో వెళుతూ ఉంటే అందుకు భిన్నంగా విశ్వక్ మాత్రం కెరీర్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఇలా అఘోరా పాత్రలలో కనిపించడం మాత్రం మెచ్చుకోదగిన విషయం. ఇలాంటి కొత్త తరహా కథలో ప్రేక్షకుల ముందు తీసుకొస్తే తప్పకుండా ఆదరిస్తారు అని అతను నిరూపించాడు.

గామి సినిమాకు విద్యాధర్ దర్శకత్వం వహించగా UV గ్రాండ్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు అందించిన ఈ సినిమా మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ కి మరింత బూస్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సినిమా ఓటీటీలో కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యింది.

మార్చి 8న థియేట్రికల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి సినిమా నెల రోజుల కంటే ముందే ఓటీటీ లో కూడా విడుదల కావచ్చు అనేలా టాక్ అయితే వినిపించింది. కానీ థియేటర్లో రెస్పాన్స్ బాగుండడంతో సినిమాను తొందరగా ఓటీటీ విడుదల చేయలేదు. ఇక ఇప్పుడు మొత్తానికి ఏప్రిల్ 12న సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక మళ్లీ డేట్ మారుతుంది అనే ఊహాగానాలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఈరోజు అర్ధరాత్రి నుంచి క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రపంచంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే దక్కుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు డిజిటల్ లో కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక గామి సినిమాలో చాందిని చౌదరి ఒక స్పెషల్ పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మనుషుల స్పర్శను తట్టుకోలేని ఒక అఘోరా తన సమస్యను తీర్చుకోవడానికి ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఇక ఆ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు అనేదే సినిమాలోని అసలు కథ. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.