Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ అడ్డాలో కూడా విశ్వక్ అదే దూకుడు

యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర గామి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ కి కేవలం మూడు రోజుల్లోనే క్రాస్ చేసింది. ఈ మూవీకి ప్రీమియర్ షోల ద్వారా 160,156 డాలర్లు కలెక్షన్స్ వచ్చాయి.

By:  Tupaki Desk   |   12 March 2024 3:54 AM GMT
ఓవర్సీస్ అడ్డాలో కూడా విశ్వక్ అదే దూకుడు
X

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గామి. ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఈ వీకెండ్ గోపీచంద్ భీమా, విశ్వక్ గామి రిలీజ్ అయ్యాయి. వీటిలో గామికి ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం కొత్త కంటెంట్, హై లెవెల్లో విజువలైజేషన్, విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్ అని తెలుస్తోంది.

గత ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో మాస్ కమర్షియల్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు గామితో డిఫరెంట్ అప్రోచ్ లో ఆడియన్స్ ని మెప్పించారు. మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. కథ నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా తాను సిద్ధం అని విశ్వక్ సేన్ గామితో కొత్త తరం డైరెక్టర్స్ కి హింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర గామి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ కి కేవలం మూడు రోజుల్లోనే క్రాస్ చేసింది. ఈ మూవీకి ప్రీమియర్ షోల ద్వారా 160,156 డాలర్లు కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు 127,863 డాలర్స్, రెండో రోజు 112,220 డాలర్స్, మూడో రోజు 56,006 డాలర్స్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 456,245 డాలర్లు ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇండియన్ కరెన్సీలో 3.77 కోట్ల గ్రాస్ గామి మూవీ వసూళ్లు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా గామి మంచి కలెక్షన్లు అందుకుంటోంది. చాలా ఏరియాల్లో ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. విశ్వక్ సినిమా క్లిక్కయితే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో మరోసారి అర్థమైంది. ఇక సినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటించారు. ఆ పాత్ర కోసం అతను చేసిన హార్డ్ వర్క్ వెండితెరపై బాగా హైలెట్ అయ్యింది.

మొత్తానికి గామి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని మూడు రోజుల్లోనే క్రాస్ చేసి లాభాల బాట పట్టింది. లాంగ్ రన్ లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ మూవీ సక్సెస్ విశ్వక్ సేన్ నుంచి నెక్స్ట్ రాబోయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.

గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది. రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. నెక్స్ట్ లైన్ లో మెకానిక్ రాకీ, లైలా సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. వీటి తర్వాత ఫలక్ నుమా దాస్ 2 ఉంటుందని తెలుస్తోంది. మెకానిక్ రాకీ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశ్వక్ సేన్ రెగ్యులర్ కమర్షియల్.